గల్ఫ్ కార్మికుల ఉపాధి బాట...ఆ బతుకు బాటలో వెతలెన్నో...!

by Mahesh |
గల్ఫ్ కార్మికుల ఉపాధి బాట...ఆ బతుకు బాటలో వెతలెన్నో...!
X

దిశ, తాడ్వాయి: ఉపాధి వేటలో గల్ఫ్ బాట పట్టిన వారు అక్కడే మృతి చెందుతుందడంతో స్వదేశంలో వారి కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారవుతుంది. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో భార్య పిల్లలు తల్లిదండ్రులకు పూట గడవడమే ప్రశ్నర్థకంగా మారుతోంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న బాధితులు సర్కార్ చేయూత కొరకు ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా ఓ వైపు గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలు, మరోవైపు అరబ్ దేశాల్లో అమలవుతున్న ఆర్థిక పరమైన కార్మిక చట్టాలు వలస కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన దాదాపు 25 వేల మందికి పైగా గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం బతుకుతున్నారు. ఏళ్ల నుంచి వారంతా గల్ఫ్‌ దేశాలైనా సౌదీ అరేబియా, దుబాయ్‌, మస్కట్‌, కత్తర్‌, లాంటి దేశాలకు ఉపాధి కోసం వలసలు వెళ్లారు. ఇప్పటికీ ప్రతిరోజూ ఇక్కడి నుంచి చాలా మంది నిరుద్యోగ గ్రామీణ యువకులు గల్ఫ్‌ దేశాల బాట పడుతూనే ఉన్నారు. ఊహల్లో మేడలు కట్టేయొచ్చు అనే విధంగా అమాయకులైన యూవతనే టార్గెట్ చేసుకొని ఏజెంట్లు మోసాలు చేస్తున్న వారి సంఖ్య కూడా రెట్టింపవుతోంది.

ఎన్ఆర్ఐ పాలసీ ఎన్నికలకే పరిమితం

గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి వేట కోసం అనేక రకాల ఇబ్బం దులకు గురవుతున్నారు.గల్ఫ్‌ దేశాల్లో మరణించిన వారి శవాలను కూడా ఇక్కడికి రప్పించేందుకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి.అక్క డి యాజమాన్యాల మోసాలకు సైతం వందలాది మంది బలి పశువులు అవుతున్నారు. ఉద్యోగ భద్రత లేక, తక్కువ వేతనాలకే మండుటెండలో వెట్టిచాకిరి చేస్తున్నారు.చాలా మంది అనారోగ్యంతో, మరికొంతమంది అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు ఎన్నికల సమయంలో ప్రభుత్వలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేస్తామని నాయకుల మాటలు నీటిముఠలె అవుతున్నాయి. ప్రతీసారి ఎన్నికల సమయంలోనూ పోటీ చేసే అభ్యర్థులు తాము గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తుండడం రివాజు గా మారింది.

ఆగమవుతున్న వలస కార్మికుల బతుకులు

ఎడారి ఇసుక దిబ్బల్లో బగబాగా మండే ఎండ వాన చలి అనే తేడా లేకుండా విపత్కర పరిస్థితుల్లో సైతం వీరంతా రాత్రింబవళ్లు అతి తక్కువ వేతనాలకే శ్రమిస్తున్నారు.అరబ్ కంపెనీల మొండి వైఖరితో తక్కువ వేతనాలు తీస్కుంటూ చేసిన అప్పులు తీర్చలేక పోతున్నారు.అలాగే ఒక్కో గదిలో పది మందికి పైగా గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సరైన వైద్యం అందక ఎందరో మంది ప్రాణాలు వదులుతున్నారు.దీంతో పాటు పని ఒత్తిడితో మానసిక కుంగుబాటుకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

గల్ఫ్ దేశంలో చనిపోతే మృతదేహం కొరకు కుటుంబాల పడిగాపులు

పుట్టి పెరిగిన ఊరును తోబుట్టువులను విడిచిపెట్టి గల్ఫ్ బాట పడితే అనుకోని ప్రమాదం సంబందించిన,అనారోగ్య కారణాలతో మృతి చెందుతే వారి మృతదేహం స్వగ్రామానికి చేరాలంటే కత్తిమీద సాములా మారుతుంది.తాడ్వాయి మండలం కృష్ణజి వాడి గ్రామానికి చెందిన దాసరి నర్సింలు మస్కట్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే నేల రోజులు కడసారి చూపు కొరకు కుటుంబ సభ్యులు వేచి దుస్థితి నెలకొంది.మరో గల్ప్ కార్మికుడు రాజంపేట్ మండలం అర్గోండ గ్రామస్థుడు కొర్పొల్ శ్యామయ్య సౌదీ దేశంలో అనారోగ్యానికి గురైన చనిపోయాడని కుటుంబ సమాచారం అందించిన 20 రోజుల నాటికి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.ఇలాగ గల్ప్ కార్మికులు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న దయానియా పరిస్థితులు నెలకొన్నాయి.ఇట్లా తోటి కార్మికులు చందాల రూపంలో పోగుచేసి మృతదేహాన్ని ఇంటికి పంపాల్సిన దుస్థితి నెలకొంది.గల్ఫ్‌లో మృతి చెందిన కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఆర్థిక సహాయం అందించకపోవడంపై గల్ప్ కార్మికుల కుటుంబలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గల్ప్ కార్మికుల కొరకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి

వలస కార్మికుల సంక్షేమానికి అవసరమైన ప్రత్యేక చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. కేరళ తరహా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి.ఏడాది వార్షిక బడ్జెట్ లో 500 కోట్ల నిధులు కేటాయించాలి. గల్ఫ్ లో మరణించిన కుటుంబానికి రూ, 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలి.:-గల్ప్ కార్మికులు అవగాహన వేదిక సంస్థ సభ్యుడు మహమ్మద్ ఫారుక్

Next Story

Most Viewed