- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీరప్ప పల్లె ప్రకృతి వనంకు నిప్పు.. పూర్తిగా కాలిపోయిన చెట్లు
దిశ, తాడ్వాయి: బీరప్ప పల్లె ప్రకృతి వనం లో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో 10 ఎకరాల విస్తీర్ణంలో నాటిన చెట్లు పూర్తిగా కాలిపోయిన ఘటన శనివారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది . వివరాలోకి వెళ్లగా.....చిట్యాల గ్రామంలో కురుమ సంఘం ఆరాధ్య దైవం బీరప్ప గుడి దగ్గరలోని పరిసర ప్రాంతాల చుట్టూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 10 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో బీరప్ప పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి అందులో చెట్లు నాటారు. గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ప్రకృతి వణంలోని చెట్లు, బోరు మోటార్, కేసింగ్, వైర్లు, పూర్తిగా కలిబూడిదయ్యయి. ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన మొక్కల మధ్యలో ఏపుగా పెరిగిన గడ్డిని తొలగించకపోవడం వలనే ఈ చెట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రకృతి వనంలో అర్ధ రాత్రి అయిందంటే చాలు తాగుబోతులకు నిలయంగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం ఈ విధంగా కాలిపోవడానికి పర్యవేక్షించే అధికారుల నిర్లక్ష్యమా.. అనే భావన గ్రామ ప్రజల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, తమకు తగు న్యాయం చెయ్యాలని కురుమ సంఘ సభ్యులు అధికారులను కోరుతున్నారు. దిశ ప్రతినిధి ఎంపీడీవోకు వివరణ కోరగా దీనిపై పూర్తి విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.