- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రెండు రోజుల తర్వాత జాలరి మృతదేహం లభ్యం
దిశ, మాచారెడ్డి : ఎగువ మానేరు వాగు ప్రవాహంలో గల్లంతైన జాలరి మృతదేహం 48 గంటల అనంతరం నీటిలో తేలి ఒడ్డుకు చేరింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన కైరం కొండ శివరాములు (55) అనే మత్స్య కార్మికుడు ఆదివారం ఉదయం కురుస్తున్న వర్షం లోనే చేపల వేటకు వెళ్లాడు. శివరాములు ప్రమాద వశాత్తు వాగు ప్రవాహం లో చిక్కుకొని గల్లంతయ్యాడు. రెండు రోజులుగా ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న వాగులో గాలించినా ఆచూకీ దొరకలేదు. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ, డి ఎస్పి, సీఐ, ఎస్ఐ చేరుకుని పర్యవేక్షించారు. గంగమ్మ తల్లి ఉగ్ర రూపం చాలించిన తర్వాత నే మృతదేహం లభ్యమైంది. మాచారెడ్డి ఎస్ఐ అనిల్ సమక్షంలో శవాన్ని బయటకు తీశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని, అటువైపు వెళ్లకుమని తోటి వారు చెప్పనా వినకుండా పోయి మాకు దూరమయ్యావా... అంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. లచ్చ పేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మత్స్య కార్మికులు కోరారు.