- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TRS : మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవుల భర్తీకి రంగం సిద్ధం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో సీనియర్లకు బుజ్జగించే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నాయకులు. చాలా మంది సీనియర్లు పదవులు లేవని గతంలో ఉన్న పదవులను పొడగించాలని చేసుకున్న రిక్వెస్టుల ఫలితంగా ముగ్గురికి ఇటీవల పదవులను కొత్తగా అప్పగించారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ ఇటీవల గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కాలం ముగియడంతో పదవి కాలానికి మరో ఏడాదికి పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ధర్పల్లి రాజేశ్వర్ పదవి కాలం పూర్తి కావడంతో గవర్నర్ కోటాలో ఇతరులను అడ్జెస్ట్ చేయడంతో అతనికి తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించిన డాక్టర్ మధుశేఖర్ కు తెలంగాణ వైద్య మండలి కార్పొరేషన్ పోస్టును అప్పగించారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి (నూడా)కు కొత్త చైర్మన్ గా ఈగ సంజీవరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత పాలకవర్గంలో సభ్యుల గురించి ఇంకా ప్రకటన రాలేదు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో 17 మార్కెట్ కమిటీలు ఉండగా నిజామాబాద్, ఆర్మూర్ మార్కెట్ కమిటీలు మినహా మిగిలిన అన్నింటిని భర్తీ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించడం అవి ఏడాది కొనసాగా యి. వాటికి మరో ఆరు నెలలు పదవి కాలం పొడగించి వదిలేశారు. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు పాలకవర్గాలను నియమించలేదు. చాలా మంది ఆశవాహులు వాటిపై కన్నేసిన సంబంధి త మార్కెట్ కమిటీ పదవులను అర్బన్ వారికి ఇవ్వాలని నూడా చైర్మన్ పదవిని రూరల్ ఇవ్వాలన్న ఒప్పందం ఎమ్మెల్యేల మధ్య జరిగిం దన్న చర్చ ఉంది. అంతేగాకుండా డైరెక్టర్ల పోస్టులను ఎమ్మెల్యేలు సమానంగా తమ అభ్యర్థులకు నామినేట్ చేసిన విధంగా ఒప్పం దం కుదిరినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా లో ఉన్న అన్నీ పదవులు పూర్తి కాగా రేపో మాపో నిజామాబాద్, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలను పాలకవర్గాలను నియమిస్తారని చర్చ జరుగుతుంది. అదే మాదిరిగా ఆర్మూర్ మున్సిపాలిటీలోని కోఆప్షన్ సభ్యుల నియామకం చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న అన్ని పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కేటీఆర్ పర్యటన తర్వాత పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగింపులు కొత్త వారి నియామ కాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కచ్చితం గా గెలువాలని ఎమ్మెల్యేలు తమ క్యాడర్ చేజారిపోకుండా పదవులను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 8, 9 సంవత్సరాలు చుట్టు రా తింపుకుని ఇంత వరకు ఎలాంటి పదవులు ఇవ్వలేని ఎమ్మెల్యేల పట్ల క్యాడర్ గుర్రుగా ఉంది. ఇదే కంటిన్యూ అయితే ఎన్నికల్లో దెబ్బ అవుతుందని ఇటీవల కాలంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు ఉమ్మడి జిల్లాలోని పదవులను భర్తీ చేసేందుకు ఎమ్మె ల్యేల ద్వారా ఆశవాహులను పరిగణలోకి తీసుకుని భర్తీ చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొ న్నాయి. ఇటీవల జిల్లా పరిషత్ లో తలెత్తిన సంక్షోభానికి మంత్రి తనదైన స్టైల్ లో చెక్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కార్పొరే షన్ పదవుల భర్తీతో ఆయా సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ పదవుల పందేరానికి తెర లేపిందన్న చర్చ జరుగుతుంది.
- Tags
- TRS