దిశ ఎఫెక్ట్.. అల్లుకున్న తీగలను తొలగించిన సిబ్బంది

by Nagam Mallesh |
దిశ ఎఫెక్ట్.. అల్లుకున్న తీగలను తొలగించిన సిబ్బంది
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కొటార్ మూర్ రెవెన్యూ గ్రామంలో ఎస్ ఎస్ 34 ట్రాన్స్ ఫార్మర్ గుండా రైతులకు సరఫరా విద్యుత్ స్తంభాల్లో పచ్చని తీగలు విద్యుత్ స్తంభానికి అల్లుకొని విద్యుత్ వైర్ల వరకు వెళ్లాయి.. దీనిపై ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అని బుధవారం దిశ లో కథనం ప్రచురితమైంది. దీనికి ఆర్మూర్ విద్యుత్ అధికారులు డీఈ హరి చందు నాయక్, ఏడీఈ రాజేశ్వర్లు స్పందించి సరిచేయాలంటూ సిబ్బందిని ఆదేశించారు. పెరికిట్ విద్యుత్ ఏఈ భాస్కర్, లైన్మెన్ సత్యనారాయణ గౌడ్ లు సిబ్బందికి సూచించడంతో వారు శుక్రవారం కోటార్మూరులోని ఎస్ ఎస్ 34 ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ స్తంభానికి అల్లుకున్న తీగలను జూనియర్ లైన్మెన్లు అరుణ్, ప్రభువులు తొలగించి ప్రమాదం జరగకుండా ఏర్పాటు చేశారు. దిశలో ప్రచురితమైన కథనానికి ఆ ఏరియాలో గల రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed