Kamareddy: మరణంలోనూ వీడని స్నేహం.. రాము, రమేశ్ ఇక లేరు..!

by srinivas |   ( Updated:2024-09-14 07:55:17.0  )
Kamareddy: మరణంలోనూ వీడని స్నేహం.. రాము, రమేశ్ ఇక లేరు..!
X

దిశ, వెబ్ డెస్క్: ఇద్దరు స్నేహితులు కలిసి పెరిగారు. స్కూలుకు వెళ్లారు. తిన్నారు. ఆడుకున్నారు. గొడవపడ్డారు. తన్నుకున్నారు. సినిమాలు, షికార్లకు వెళ్లారు. అందరితో శభాష్ అనిపించారు. స్నేహమంటే ఇదేరా అని నిరూపించారు. అంతలా ఆకట్టుకున్న వీరి స్నేహం చివరకు విషాదంగా మిగిలింది. ఇద్దరు ఒకేసారి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఉగ్రవాయిలో జరిగింది. రాము, రమేశ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. గ్రామంలో ఎటు చూసినా ఈ ఇద్దరే కనిపించేవాళ్లు. వీళ్ల సావాసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా రాము, రమేశ్ కలిసి మెలిసి ఉండేవాళ్లు. కానీ రోడ్డు ప్రమాదం రూపంలో వీరి స్నేహాన్ని కబలించింది.

ఉగ్రవాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాము, రమేశ్‌ తీవ్రంగా గాయపడ్దారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ స్నేహితులకు ప్రాణం పోయాలన్న వైద్యుల ప్రయత్నం విజయం సాధించలేదు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో రాము, రమేశ్ మృతి చెందారు. ఈ ఇద్దరు స్నేహితులు ఇక లేరన్న విషయం తెలిసి ఉగ్రవాయి గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. రాము, రమేశ్ లాంటి మంచి స్నేహితులను మళ్లీ చూడలేమంటూ కంటతడి పెట్టారు.

Advertisement

Next Story