- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ola, Uber : ఫోన్ మోడల్ ను బట్టి చార్జీల్లో తేడా.. ఓలా, ఉబర్ లకు కేంద్రం నోటీసులు

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకే రకమైన రైడ్ కు ఫోన్ మోడళ్లను బట్టి వేర్వేరు చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కేంద్రం రంగంలోకి దిగింది. ఈ అంశంపై తాజాగా క్యాబ్ అగ్రిటర్ సంస్థలైన ఓలా, ఉబర్ (Ola, uber) లకు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు (Centre's Notice) ఇచ్చింది. వినియోగదారులు ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనే తేడా మాత్రమే కాకుండా ఫోన్ రేట్ ను బట్టి కూడా ధరల్లో తేడా ఉంటోందని, అలాగే ఒకే సర్వీసుకు రెండు సంస్థలు వేర్వేరు చార్జీలు వసూలు చేస్తున్నట్లు చాలా కాలంగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) చర్యలకు ఉపక్రమంచింది. ఈ ధరల్లో తేడాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతున్నదని ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తారు? వస్తున్న ఆరోపణలపై సరైన వివరణతో రావాలని ఆదేశించింది. కాగా ఇటీవల ఢిల్లీకి చెందిన రిషభ్ సింగ్ అనే వ్యక్తి ఎక్స్ లో పెట్టిన ఓ పోస్టు బాగా వైరల్ అయింది. క్యాబ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ ఫోన్ మోడల్ ను బట్టే కాదు అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజీని బట్టి కూడా చార్జీల్లో వ్యత్యాసం చూపిస్తోందని ఆయన ఆరోపించారు. రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఓఎస్ డివైజులలో ఒకే అకౌంట్ తో లాగిన్ అయి ఒకే ప్రదేశానికి రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఈ తేడాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దింగిది.
తేడాలు గమనించాం: ప్రహ్లాద్ జోషి
ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi jyosh) ఎక్స్ వేదికగా స్పందించారు. వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫోన్స్ ఐవోఎస్ మోడళ్ల ఆధారంగా ప్రయాణ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే ఓలా, ఉబర్ కు నోటీసులు ఇచ్చామన్నారు. ఆ సంస్థల నుంచి ప్రతిస్పందన కోసం చూస్తున్నామని తెలిపారు. మంత్రి ట్వీట్ పై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. సర్ ఈ దోపిడి క్యాబ్ అగ్రిగేటర్లకే పరిమితం కాలేదని ఈ కామర్స్, టికెట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ వంటి ప్లాట్ ఫారమ్ లలోనూ ధర్లలో వైవిద్యాలను చూస్తున్నామన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (Pralhad Joshi jyosh)