- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Alarm Effect : అలారం పెట్టుకొని నిద్రలేస్తున్నారా..? జర జాగ్రత్త !

దిశ, ఫీచర్స్ : మనలో చాలామంది ఉదయం త్వరగా లేవాలని రాత్రిళ్లు అలారం సెట్ చేసి పడుకుంటారు. దాని శబ్దం వినబడగానే మేల్కొంటారు. గాఢ నిద్రలో అలారం పదే పదే మోగడంతో తప్పనిసరిగా మేల్కొంటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. కానీ రోజూ ఇలా అలారం పెట్టుకొని పడుకోవడం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అంతేకాకుండా అలారం శబ్దానికి ఆకస్మిక మేల్కొలు మానసిక స్థితిలో మార్పునకు, అధిక రక్తపోటుకు కారణం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జినియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
అధ్యయనంలో ఇలా..
స్టడీలో భాగంగా పలువరిని అబ్జర్వ్ చేసిన రీసెర్చర్స్ నేచురల్‌గా నిద్రలేచేవారితో పోలిస్తే.. అలారం పెట్టుకొని మేల్కొనే వారిలో 74 శాతం మందికి బ్లడ్ ప్రెజర్ అధికంగా ఉంటున్నట్లు గమనించారు. అట్లనే తక్కువ నిద్రపోయేవారిలోనూ బీపీ సమస్య ఉంటోందని పేర్కొన్నారు. ఎందుకలా జరుగుతుందంటే.. మంచి నిద్రలో ఉన్నప్పుడు అలారం అకస్మాత్తగా మోగడం వల్ల అకస్మాత్తుగా నిద్రమేల్కొంటాం. ఈ అప్పుడు శరీరం స్ట్రగ్గుల్ రియాక్షన్‌కు గురవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మెదడులో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు రిలీజ్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంపై ప్రభావం
తక్షణ బెదిరింపులు, ఆపదలు, ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ హార్మోన్లు ముఖ్యమే అయినప్పటికీ, అవి మన శరీరాన్ని నిద్రనుంచి మేల్కొలపడానికి రూపొందినవి కావని పరిశోధకులు అంటున్నారు. అందుకని అలారం శబ్దంతో ఆకస్మిక మేల్కొలుపు ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలకు, అధిక రక్తపోటుకు తద్వారా గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. అంతేకాకుండా అలారం శబ్దానికి అలర్ట్ అయి లేవడంవల్ల అది సహజమైన భావోద్వేక నియంత్రణకు, మానసిక స్థితికి ఆటంకం కలిగిస్తుంది. నిద్రకు భంగం కలిగించడం ద్వారా ఆందోళన, చికాకు, తలనొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.
పరిష్కారం ఏమిటి?
అలారం పెట్టుకొని నిద్రమేల్కొనడం తరచుగా కొనసాగిస్తే ఒత్తిడి పెరగడం మూలంగా చివరకు అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించాలంటున్నారు నిపుణులు. ఆకస్మాత్తుగా లేపే అలారాలకు బదులుగా మీ మొబైల్ ఫోన్లలో స్మూత్‌గా ఉండే ‘స్నూజ్ ఎంపిక’ను ఉపయోగించవచ్చు. ఇవి ఒకేసారి అకస్మాత్తుగా కాకుండా ఒకే ట్యూన్ లో లో - పిచ్ శబ్దాలను ప్రసారం చేస్తూ మేల్కొలుపుతాయి. నిద్రపోతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన అనుభూతి ఏర్పడదు. కాబట్టి పెద్ద సమస్య ఉండకపోవచ్చు. దీనికంటే బెటర్ ఎలాంటి అలారం, ఇతర ప్రేరణలు లేకుండా సహజంగానే నిద్ర మేల్కొనేలా అలవాటు చేసుకోండి.
లేటుగా కాకుండా త్వరగా పడుకోవడం, త్వరగా లేకవడం అలవాటు చేసుకోవాలి. కనీసం 7 గంటలు నిద్రపోవడం నాణ్యమైన నిద్రకు కారణం అవుతంది. ఇది మీ శరీరంలో సిర్కాడియన్ రిథమ్‌ను, స్లీప్ సైకిల్‌ను నియంత్రించడం ద్వారా అలారం పెట్టుకోకపోయినా రోజూ ఒకే సమాయానికి నిద్రమేల్కొనేలా చేస్తుంది. ఒకప్పుడు చాలామంది ఇలానే చేసేవారు. ఇప్పటికీ మన కుటుంబాల్లోని పెద్దలు ఉదయం 5 గంటలకే ఎవరూ లేపకపోయినా, ఎలాంటి అలారం పెట్టుకోకపోయినా నిద్రలేస్తుంటారు. కారణం వారు సరైన నిద్ర షెడ్యూల్‌ను మేనేజ్ చేయడమే. కాబట్టి మీరు కూడా మీ శరీరానికి అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలంటున్నారు నిపుణులు.