- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు యువకుల ఆత్మహత్య..ఎందుకంటే..?
దిశ, గాంధారి/సదాశివనగర్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని జువ్వాడి గ్రామానికి చెందిన చాకలి సంపత్ (22) తనకు ఇష్టం లేని వివాహ చేస్తున్నారని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్న సమయంలో ఎవరికి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో ఫోన్ చేస్తే స్విచాఫ్ రావడంతో.. అదే రోజు రాత్రి వరకు బంధువుల ఇంటికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జువ్వాడి గ్రామ శివారులో గల వ్యవసాయ బావిలో ఒక శవం పడి ఉన్నదని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో.. ఎస్సై ఆంజనేయులు సంఘటన స్థలానికి వెళ్లి బావిలో నుండి శవం ను బయటకు తీశారు. మృతుడుని చాకలి సంపత్ గా గుర్తించడం జరిగిందన్నారు. అయితే తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుని ఆత్మహత్య...
కామారెడ్డి జిల్లా సదశినగర్ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్ (24) కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ..శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నుండి బయలుదేరి ఎవరికి చెప్పకుండా బొంపల్లి గ్రామ శివారులో గల చెరువు కట్ట పైన యాప చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపారు. తండ్రి మగ్గం రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ ఎస్సై రంజిత్ తెలిపారు. శవాన్ని పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రంజిత్ పేర్కొన్నారు.