సమాజానికి విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు

by Naveena |
సమాజానికి విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు
X

దిశ, కామారెడ్డి : సమాజానికి విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాలులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో.. వివిధ కళాశాలల విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, ఉమన్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్, హెల్త్ అండ్ వెల్నెస్, సోషల్ మీడియా అనే ఆరు అంశాలపై పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం తొలిసారి అని తెలిపారు. ప్రతి 4 నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ప్రతి ఒక్కరు నియమనిబంధనలు పాటించాలన్నారు. సైబర్ నేరాలు పెట్రేగిపోతున్నాయని,వాటి పట్ల జాగ్రత్తలు పాటించాలని, డ్రగ్స్ వాడకం కూడా పెరుగుతుందని, నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ.. ఈ వయసులో విద్యార్థులకు కొత్త ఆలోచనలు వస్తాయని, విద్యార్థుల మాటకు విలువ ఉంటుందని, అందుకే విద్యార్థులను అంబాసిడర్లుగా చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ఆరు అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని,కళాశాలల్లో ఏర్పాటు చేసే ఒక్కొక్క క్లబ్ ద్వారా విద్యార్థులందరికీ వీటి ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. అనంతరం ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేశ్వర్ రావు, వివిధ కళాశాలల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed