రైతుల గోస పట్టని షిండే ఖబర్దార్

by Sridhar Babu |
రైతుల గోస పట్టని షిండే ఖబర్దార్
X

దిశ, నిజాంసాగర్ : నాగమడుగు ఎత్తిపోతల పథకం పై మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే తప్పుడు ప్రచారం మానుకోవాలని, లేదంటే రైతులు చేతులకు పని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని షిండే ఖబర్దార్ అని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రజా పండరి హెచ్చరించారు. శుక్రవారం నాగమడుగు ఎత్తిపోతల పథకం పై మాజీ ఎమ్మెల్యే రైతులకు తప్పుడు ప్రచారం చేసి రెచ్చ గొడుతున్నారని రైతులతో కలిసి శుక్రవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాగమడుగు ఎత్తిపోతల పథకం నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన మంజీర నదిలో నిర్మించేందుకు రూ.476 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నిజానికి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు గాను కేవలం 11.6 ఎకరాలు సేకరించాల్సిన అవరసం ఉందని అనడంతో రైతులు ముందుకు వచ్చి భూములను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇచ్చేందుకు ఒప్పుకున్నారని తెలిపారు.

కానీ నేడు ప్రాజెక్ట్ నిర్మాణం రీ డిజైన్ చేసి సుమారు 300 ఎకరాలు సేకరించాల్సిన పరిస్థితి నెలకొందని, దీంతో భూములను నమ్ముకున్న రైతులు భూములను కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నాని పేర్కొన్నారు. వడ్డేపల్లి, కోమలంచా, జక్కపుర్ గ్రామాల శివారు రైతులు భూములు ఇచ్చేందుకు సిద్దంగా లేరని అన్నారు. అందుకు గాను ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తో భూ బాధితులు తమ భూములను కాపాడాలని వినతిపత్రం అందజేశారు. వీలైతే ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చి రీ డిజైన్ చేయాలని కోరినట్లు తెలిపారు. గతంలో పనులు ప్రారంభించే ముందు ప్రాజెక్టు నిర్మాణం డిజైన్ 11.6 ఎకరాలు సేకరించాలని ఉండగా 7 కిలోమీటర్ల వరకు మంజీర నది ఇరువైపులా కరకట్ట నిర్మించి పంపుహౌజ్ నుండి జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్, పీట్లం,బిచ్కుంద,

జుక్కల్,పెద్ద కొదప్ గల్ ,మద్నూర్ వరకు సాగు నీరు అందిస్తామని ప్రణాళిక చేసి దానిని మార్చి సుమారు 300 ఎకరాలు భూమి కోల్పోతున్న రైతులను పట్టించుకోలేదని అన్నారు. అందుకు గాను రైతులు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు భూములు కోల్పోకుండా ప్రాజెక్టు రీ డిజైన్ చేయాలని వినతి పత్రం అందజేశారని, ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే జుక్కల్ నియోజకవర్గ రైతులకు తప్పుడు ప్రచారం చేసి రైతులను రెచ్చ గొడుతున్నాడు అని అన్నారు. కౌలస్ ప్రాజెక్టు, లెండి ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టులు జుక్కల్ నియోజకవర్గంలో ఉండటంతో సాగు నీరు పుష్కలంగా ఉన్నాయని, కావున ప్రజా ధనం

వృథా చేయకుండా రైతుల పొట్ట కొట్టకుండా సాగు నీరు అందించేందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుతున్నాం అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఇప్పటి వరకు కేవలం 7 శాతం పనులు మాత్రమే జరిగాయని, గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించిన నివ్వు అసలు నిజాలు తెలుసుకుని మాట్లాడాని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చికోటీ జయ ప్రదీప్, మాజీ వైస్ ఎంపీపీ మల్లికార్జున్, మండల అధ్యక్షడు రవీందర్ రెడ్డి, అనీస్ పటేల్, ఖాలేక్,నాగ భూషణం,వెంకట్ రెడ్డి, మీనా సింగ్, రాథోడ్ రాము, మౌలాజి, అజ్జం దుర్గయ్య, రాజాగౌడ్, కిరణ్, బాలరాజు, వినోద్, బొజ్జ అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed