18 కార్టన్ ల మద్యం పట్టివేత

by Sridhar Babu |
18 కార్టన్ ల మద్యం పట్టివేత
X

దిశ, భిక్కనూరు : ముందస్తు సమాచారం మేరకు అక్రమంగా డంపు చేస్తున్న 18 కార్టన్ల మందు బాటిళ్ల ను గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే... సొసైటీ చైర్మన్ ఇంట్లో మద్యం కార్టన్లను డంపు చేసేందుకు ఇంట్లోకి తీసుకెళ్లారు. అదే సమయంలో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి 156 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని భూమయ్యతోపాటు, సిద్ధ రామేశ్వర వైన్స్ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్షా 90 వేల రూపాయలు ఉంటుందని సమాచారం.

బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ

మద్యం పట్టుబడిన విషయమై బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మందు సమాచారం పోలీసులకు అందించడమే కాకుండా, అనుమతి లేకుండా తమ ఇంట్లో కి చొరబడి దొంగతనానికి పాల్పడతారా...? అంటూ బీజేపీ శ్రేణులపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో చైర్మన్ ఇంటి ముందు కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్యం పట్టించేందుకు మీరెవరని, బరాబర్ మందు పంపిణీ చేస్తామని, అడిగేందుకు మీరెవరంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పార్టీల నాయకులను పక్కకు తప్పించి, మద్యాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

Next Story

Most Viewed