- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ తనయుడి పై ఎఫ్ఐఆర్ నమోదు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పై బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాన్సువాడ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇంటి పై మంగళవారం అర్ధరాత్రి పోచారం భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు పాత బాలకృష్ణ, ప్రమోద్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు శంభు రెడ్డి కొడుకు వినోద్ రెడ్డిలు అక్రమంగా ప్రవేశించి డ్రైవర్లను కొట్టడమే కాకుండా మాజీ ఎమ్మెల్యేను చంపుతామని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం రాత్రి యెండల లక్ష్మీనారాయణ ఇంట్లోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయి.
తమ పై దాడి చేసిన పోచారం కుటుంబ సభ్యుల పై డ్రైవర్లు దత్తు, కిషోర్లతో పాటు ఎండల లక్ష్మీనారాయణ బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంబేద్కర్ విగ్రహం ముందు మాజీ ఎమ్మెల్యే నిరసన దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో 321 ఎఫ్ఐఆర్ నంబర్ లో 9 సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు పోచారం కుటుంబ సభ్యుల పై దాడి, దౌర్జన్యానికి సంబంధించిన కేసు నమోదు కావడం రాజకీయంగా కలకలం రేపింది. ఎన్నికల్లో పోచారం కుటుంబం పై ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నట్టుగానే రాజకీయ పరిస్థితులు తలెత్తడం పై అధికార పార్టీలో కలవరం మొదలైంది.