- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి..
దిశ, ఆర్మూర్ : బాల్కొండ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిత్ర మిశ్రా బుధవారం తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఓటర్లందరూ వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 246 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. మోడల్ పోలింగ్ స్టేషన్ లు 12 ఏర్పాటు చేయగా యూత్ 1, మహిళలకు 5, వికలాంగులకు 1, మోడల్ పోలింగ్ స్టేషన్ లు ఐదు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ లు 246 ఏర్పాటు చేయగా ఈవీఎం లు 246 పంపిణీ చేశారు.
377 కంట్రోల్, 317 బాలన్స్ యూనిట్స్ పంపిణీ చేశారు. రిజర్వ్ లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెన్స్ యూనిట్స్ లు 60 చొప్పున ఉంచారన్నారు. ఎన్నికల నిర్వహణ కొరకు 1100 మంది సిబ్బందిని నియమించారు. అందులో పోలింగ్ ఆఫీసర్లు 492, అసిస్టెంట్ పోలింగ్ ఆఫిసర్స్ 492 పరిశీలకులుగా 53 మందిని నియమించారు. పోలింగ్ సిబ్బందిని బూత్ ల వారిగా తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది తరలి వెళ్లారు.