- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణను బీర్లు, బార్ల రాష్ట్రంగా మార్చారు : వైఎస్ షర్మిల
దిశ, బిచ్కుంద : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం యాత్ర 179వ రోజుకు చేరుకుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి శుక్రవారం షర్మిల యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఖథ్గవ్ గ్రామంలో మాట్లాడుతూ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడని, తెలంగాణను మాత్రం బీర్లు బార్ల తెలంగాణగా మార్చాడని ఎద్దేవ చేశారు. వ్యవసాయ రంగానికి అందుతున్న సబ్సిడీ పథకాలు అన్నింటిని కేసీఆర్ మూసివేశారని తెలిపారు. ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పిన కేసీఆర్ రైతుకు గిట్టుబాటు ధరను అందించకుండా, రైతు బంధు పథకం పేరిట ఐదువేల రూపాయలు రైతుకు ఇచ్చి ఎరువుల ధరలు పెంచి, రైతుబంధు పైసలను తిరిగి తీసేసుకుంటున్నాడని దుయ్యబట్టారు.
అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి తన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ఇంటి బిడ్డలకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదని ఆమె విమర్శించారు. జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హనుమంతు షిండే మొదటిసారి ఎమ్మెల్యేకు నామినేషన్ వేసినప్పుడు తన ఆస్తుల వివరాలు ఎంత ఇప్పుడు తన ఆస్తుల వివరాలు ఎంత అని సూటిగా ప్రశ్నించారు. హనుమంతు షిండే అవినీతిపై ఈడిచే విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం వైఎస్సార్ టీపీ ఇంచార్జ్ భోర్గి సంజు, నరేష్ గౌడ్ ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.