డ్వాక్రా గ్రూపు మహిళల సమస్యలను పరిష్కరించాలి..

by Sumithra |
డ్వాక్రా గ్రూపు మహిళల సమస్యలను పరిష్కరించాలి..
X

దిశ, నిజామాబాద్ సిటీ : ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తక్షణమే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సోమవారం సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో మొత్తం సుమారు 60 లక్షలకు పైగా డ్వాక్రా గ్రూపు సంఘాలలో మహిళలు ఉండి వేలకోట్ల రూపాయలు పొదుపు చేసి బ్యాంకుల్లో జమ చేసి రుణాలు పొందుతున్నారని అన్నారు.

ప్రతినెల వారంలోగా వడ్డీ చెల్లిస్తున్నారని, ఒక పూట ఆలస్యం అయినా వడ్డీ లేని రుణం వర్తించదని నిబంధనల వలన రుణభారం పెరుగుతుందని, వెసులుబాటు లేక బయటినుండి అప్పులు అధిక వడ్డీకి సైతం తెచ్చి కట్టేవారున్నారని అన్నారు. అభయ హస్తం పథకం క్రింద దాదాపు 20 లక్షల 76 వేల 403 మంది మహిళలు తమ వాటాగా డబ్బు జమ చేశారని అన్నారు. సుమారు 600 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పథకం అమలు చేయకుండా వారి డబ్బు తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తుందన్నారు. పొదుపు చేసిన సంఘాలకు రివాల్వింగ్ పండును ఇవ్వకుండ, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు.

డ్వాక్రా గ్రూపు సభ్యుల పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్, సభ్యులు మరణిస్తే ఇవ్వాల్సిన సహాయం, ఎస్సీ లకు ఇచ్చే రాయితీలు, ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. ప్రభుత్వం డ్వాక్రా గ్రూపు మహిళల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించటం లేదు. దీని కారణంగా పేద మహిళలు అప్పులపాలై మెడలోని నగలు, ఆస్తులు అమ్ముకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శకుంతల, గౌరక్కజిల్లా కమిటీ సభ్యులు కీర్తన, నర్సక్క, సావిత్రి, లక్ష్మి, గీత, మంజుల అంబికా, మొదలగు అక్కలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed