- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్లాట్ల విక్రయాలు.. జిల్లా కలెక్టర్ లకు తప్పని పాట్లు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రండి బాబు రండి అలస్యం చేసిన ఆశా భంగం.. ప్రభుత్వం పూర్తి సౌకర్యాలతో ఎర్పాటు చేసిన లే అవుట్ ప్లాట్లు.. ఇండ్లు అక్యూపై చేసుకోవాడానికి సిద్ధంగా ఉన్నాయి. రండి వేలం పాటలో పాల్గొనండి.. ప్రభుత్వ అనుమతులు సకల వసతులు కలిగిన ప్లాట్లను కోనుగోలు చేయండి. మంచి తరుణం మించిన దోరకదు.. విశాల మైన రోడ్లు.. అండర్ గ్రౌండ్ డ్రైనీజీ, మీషన్ భగీరథ మంచినీరు, 24 గంటల విద్యుత్ సౌకర్యాలు కలిగిన టౌన్ షిప్ లలో ప్లాట్లను సులభమైన మూడు వాయిదాలలో కొనుగోలు చేయ్యండి. అంటు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ లు ప్రభుత్వ భూములలో ఎర్పాటు చేసిన వెంచర్ లలో ప్లాట్ల , ఇండ్ల విక్రయాలకు అగచాట్లు పడుతున్నారు. కొత్త జిల్లాల ఎర్పాటు తరువాత, ప్రభుత్వం ఆదాయం పెంపుధలకు రియల్ రంగంలో కాలు పెట్టిన విషయం తెలిసిందే. దళారుల బెడద లేకుండా కొనుగోలు ప్రీ బిడ్డింగ్, వేలం నిర్వహించడం పరిపాటిగా మారింది. జిల్లాల కలెక్టర్ లు మారుతున్న ప్లాట్ల విక్రయాలకు జిల్లా కలెక్టర్ లకు పాట్లు తప్పడం లేదు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ధరణి, దాత్రి పేరుతో ప్లాట్లు, టౌన్ షిప్ లలో ఇండ్లు కోనుగోలు చెయాలని గత కలెక్టర్ ల కాలం నుంచి విస్ర్తతంగా ప్రచారం చేసిన స్పంధన కరువైంది. ప్రభుత్వ ఖజానా నిండుకుండటంతో ఆదాయ మార్గలలో ఒకటిగా ప్రభుత్వమే రియల్ దందాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకుని, జాతీయ రహదారిని ఆనుకుని అడ్లూర్ శివారులో 121 ఇండ్లు, 132 ప్లాట్లను దరణి టౌన్ షిప్ పేరుతో నిర్మించింది జిల్లాయంత్రాంగం. నిజామాబాద్ - వర్ని రహదారిపై నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సరిహద్ధుకు కిలో మీటర్ల దూరంలో మల్లారం వద్ధ 76 ఎకరాల పై చిలుకు విస్తీర్ణంతో కూడిన దాత్రి టౌన్ షిప్ లో ప్రస్తుతం 36 .11 ఎకరాల స్థలానికి లే అవుట్ అనుమతి పొందింది. వివిధ సైజులలో మొత్తం 316 ప్లాట్లు రూపోందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్లాట్ల విక్రయానికి ప్రీ బిడ్డింగ్ వేలం పాట నిర్వహించినా స్పందన కరువైంది. ప్రభుత్వ అదేశాల మేరకు నెలలో రెండు మూడు సార్లు సమావేశాలను నిర్వహించి వేలం పాట నిర్వహణ చేయడం పరిపాటిగా మారింది.
నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్ లో రోడ్ల నిర్మాణాలు, సుమారు పదికోట్ల రూపాయల వ్యయంతో సువిశాలమైన 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు, 30 నుండి 40 ఫీట్ల విస్తీర్ణంతో కూడిన అంతర్గత రోడ్లు, మిషన్ భగీరథ ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నీటి వసతి, విద్యుత్ సరఫరా, సి.సి డ్రెయిన్లు, ఎస్.టీ.పి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. 76 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంతో కూడిన టౌన్ షిప్ లో ప్రస్తుతం 36 .11 ఎకరాల స్థలానికి లేఅవుట్ అనుమతి పొంది, వివిధ సైజులలో మొత్తం 316 ప్లాట్లు అందుబాటులోకి తెస్తున్నరు. తొలి విడతలో 80 ప్లాట్ల అమ్మకాల కోసం గత నవంబర్ 14 , 15 తేదీలలో బహిరంగ వేలం ద్వారా విక్రయించారు.
ప్రస్తుతం మరో 150 ప్లాట్ల విక్రయాల కోసం రెండవ విడతగా ఈ నెల 16 , 17 , 18 న (న్యూ కలెక్టరేట్)లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నాట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు తెలిపారు. తొలి విడత ప్లాట్ల విక్రయాల సమయంలో చదరపు గజం ప్రారంభ ధర 8000 రూపాయలు ఉండగా, ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ప్రస్తుతం ప్రారంభ ధరను చదరపు గజానికి కేవలం 6000 రూపాయలుగా కుదించారు. వేలంలో ప్లాట్ దక్కించుకున్న వారు 90 రోజుల వ్యవధిలో మూడు వాయిదాల్లో మొత్తం రుసుము చెల్లించేలా వెసులుబాటు ఉంది. ధాత్రి టౌన్ షిప్ లో మధ్య తరగతి కుటుంబాల వారికి కూడా ప్లాట్ల కొనుగోలుకు అవకాశం ఉండాలనే ఉద్దేశ్యంతో ప్లాట్లను 178 చదరపు గజాలు, 200 , 267 , 300 చదరపు గజాలుగా మొత్తం నాలుగు సైజులలో ప్లాట్ లను రూపోందించారు. తోలి విడతలో ప్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అంటగట్టిన జిల్లా అధికార యంత్రాంగం గజానికి రూ.2 వేలు తగ్గడంతో స్పంధన వస్తుందని గంపేడాశలు పెట్టుకున్నారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో అడ్లూర్ లో గల ధరణి టౌన్ షిప్ నందు ఇండ్లు(121), ప్లాట్ల (132)విక్రయానికి సంభందించి ప్రి బిడ్ అవగాహన సదస్సు లు ఇప్పటి వరకు చాల సార్లు నిర్వహించారు.ధరణి టౌన్షిప్ లో ఉన్న ప్లాట్లు, గృహాలు మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. కామారెడ్డి పట్టణంను అనుకుని ఉన్న ఈ టౌన్ షిప్ లో ఇప్పటి వరకు రోడ్ ఫేసింగ్ ప్లాట్లు, ఇండ్ల అమ్మాకాలు జరిగాయి. కాని లోపల సైడ్ కు వచ్చే సరికి ఎవరు అసక్తి చూపడం లేదు. ఉమ్మడి రాష్ర్టంలో దశాబ్ధం క్రితం నిర్మించిన ఇండ్లకు రూ.7200, ఓపెన్ ప్లాట్లకు రూ.7000 గజానికి ధర నిర్ణయించి విక్రయాలకు పెట్టారు. ప్రి బిడ్ లు , వేలం పాటలను నిర్వహిస్తున్న అమ్ముడు పోవడం లేదని అధికారులు ఇప్పటికే అక్కడ కుడా ఉద్యోగులకు కట్ట బెట్టే యత్నలు చేశారు. ప్రస్తుత మార్కేట్ లో రియల్ భూం ఉండటంతో కామారెడ్డి ధరణి టౌన్ ఫిప్ లో ధరలు మాత్రం తగ్గించలేదు. అక్కడ మోడల్ ఇళ్లను కోనుగోలు చేసిన వారు సాధరణ ఇండ్ల గూరించి పట్టించుకోవడం లేదు. కనీసం ఈ ఎడాధి ఐనా టౌన్ షిప్ లో అమ్మకాలు పూర్తవుతాయో లేదో చూడాలి.