విధులకు డుమ్మా కొట్టిన పంతులమ్మ … సస్పెండ్ చేసిన డీఈవో

by Kalyani |
విధులకు డుమ్మా కొట్టిన పంతులమ్మ … సస్పెండ్ చేసిన డీఈవో
X

దిశ, బాన్సువాడ : ప్రభుత్వం ద్వారా వేలకు వేల జీతాలు తీసుకొని విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఒక ఉపాధ్యాయురాలు ఏకంగా విధులకు డుమ్మా కొట్టి, ఠంచన్ గా జీతం తీసుకుంటున్నారన్న వ్యవహారం ఆమెపై చర్యలు సైతం తీసుకునే వరకు గోప్యంగానే ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ గ్రామీణ మండలం హన్మాజీపేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ బోధించే ఎస్జీటీ ఉపాధ్యాయురాలు రజిని ప్రియ గత నాలుగు నెలల క్రితం గాంధారి మండలం నుంచి హన్మాజీపేట్ కు బదిలీపై వచ్చారు. వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యారే తప్ప, పాఠశాలకు రాలేదు. ఇదేమిటని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ ప్రశ్నిస్తే నేను సెలవు పెట్టాను కాబట్టి పాఠశాలకు రాను అని దురుసుగా సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ విషయం చిలికి చిలికి గాలివానలా మారి ఎంఈవో నాగేశ్వరావు ద్రుష్టికి వెళ్లగా అయిన డీఈవో రాజుకు తెలపడంతో అయిన మంగళవారం పాఠశాలకు విచ్చేసి విచారణ చేపట్టి ఆమెను సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed