- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు
దిశ, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని దౌల్తాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో ప్రభుత్వం లక్షలు ఖర్చుపెట్టి నూతనంగా డంపింగ్ యార్డ్ నిర్మాణం చేసినప్పటికీ డంపింగ్ యార్డ్‌ను ఉపయోగించే పరిస్థితులు లేవు. లక్షలు ఖర్చుపెట్టి డంపింగ్ యార్డ్ నిర్మాణం చేసిన డంపింగ్ యార్డ్‌కు వెళ్లే దారిలో నూతన వెంచర్‌కు పంచాయతీ అధికారులు ఇచ్చారు. వెంచర్ యజమాని డంపింగ్ యార్డ్‌కు వెళ్లే దారిని తవ్వేయడంతో గత్యంతరం లేక పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలను ఊరికి అవతల ఆరు బయట పడేస్తున్నారు. దీంతో వచ్చి పోయే ప్రయాణికులకు తీవ్ర దుర్వాసన వస్తుందని ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
వెంచర్‌కు అనుమతి ఎలా ఇచ్చారు?
వెంచర్‌కు అనుమతి ఇవ్వడంతో.. కోతుల ఆహార కేంద్రానికి నీళ్లు పెట్టాలంటే ఎలా వెళ్లాలి అంటూ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అలాగే తవ్విన డంపింగ్ యార్డ్‌కు వెళ్లే దారినీ తిరిగి నిర్మిస్తారా లేక వెంచర్ కోసం డంపింగ్ యార్డ్‌ను వదిలేస్తారా అనేది సందిగ్ధంగా మారింది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటారో లేక చోద్యం చూస్తారో వేచి చూడాలి మరి.