ఉపాధిహామీ కూలీలతో వరి కోత పనులు

by Sridhar Babu |
ఉపాధిహామీ కూలీలతో వరి కోత పనులు
X

దిశ, గాంధారి : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కి అచ్చుగుద్దినట్టు వర్తిస్తుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ముదేళ్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ కాల్వ పనులు చేయాల్సి ఉండగా తన సొంత పొలంలో వరి కోత కోయించాడు. ఈ మేరకు ఉపాధి హామీ కూలీలు స్వయంగా తెలిపారు. తమకు ఉపాధి హామీ పని అని చెప్పి ఆయన పొలం వద్ద వరి కోత కోయించాడని కూలీలు తెలిపారు. ఉపాధి హామీ పనులు చేయించకుండా ఇలా సొంత పనులు చేయించుకోవడం ఎంతవరకు సబబని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు.

Advertisement

Next Story