రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఒకరోజు సత్య దీక్ష..

by Vinod kumar |
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఒకరోజు సత్య దీక్ష..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టాయి. కాంగ్రెస్ శ్రేణులు ఉదయం జరిగిన సత్యగ్రహ దీక్షకు ముఖ్య అతిథిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పార్లమెంట్ మెంబర్షిప్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పేద ప్రజల సంపదను అదానికి చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడని, చిన్న పారిశ్రామికవేత్తగా ఉన్న అధాని ప్రపంచ కుబేరుడుగా ఎదగడంలో నరేంద్ర మోడీ పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా నరేంద్ర మోడీని ప్రశ్నించడం ద్వారా ప్రజల ముందు దోషిగా నిలబడతామని భయంతో కుట్రపూరితంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని చెప్పారు.

సూరత్ కోర్టు రాహుల్ గాంధీ అన్న మాటల కన్నా పది శాతం ఎక్కువ రేట్లు తీర్పు ఇచ్చిందని, సూరత్ కోర్టు రాహుల్ గాంధీ కి తీర్పు ఇస్తూనే సుప్రీంకోర్టులో విచారణకు నెలరోజుల సమయంతో బెయిల్ ఇచ్చిందని, అయిన కూడా పార్లమెంటులో ఒక్కరోజులో రాహుల్ గాంధీ యొక్క సభ్యత్వం రద్దు చేశారంటే బిజెపి యొక్క ఉద్దేశం ప్రతిపక్షాల గొంతు నొక్కడం అని అన్నారు. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం ద్వారా రాహుల్ గాంధీ భయపడరని, బిజెపి యొక్క అవినీతిని ఎండగట్టడంలో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గరని గుర్తు చేశారు. అనర్హత వేటును వెనక్కి తీసుకునే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా సత్యమార్గంలో పోరాడుతూనే ఉంటామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.


ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ పైన కుట్రపూరితంగా కేసు వేసి పార్లమెంటులో అర్హత వేటు వేసిందని ,నరేంద్ర మోడీకి అదానికి ఉన్న సంబంధం గురించి రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రశ్నించినందుకే ఆయన గొంతు నొక్కడానికి అనర్హత వేటు వేశారని అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల పక్షాన రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, గతంలో ఇందిరాగాంధీ గారిపై కూడా అనర్హత వేటు వేశారని తర్వాత వచ్చినా ఎన్నికల్లో ఇందిరా గాంధీ గారి విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యారని, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి అవుతారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం అనేది నరేంద్ర మోడీ యొక్క పిరికితనానికి నిదర్శనం అని అన్నారు.,ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు కుట్రపూరితంగా వేశారని ,సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుకు నెల రోజులు గడువు ఇస్తూ బెల్ ఇచ్చినా కూడా పార్లమెంటులో ఒక రోజులోనే అనర్హత వేటు వేయడం అనేది బిజెపి ప్రభుత్వ కుట్రపూరిత చర్యకు నిదర్శమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేతిలో మోడీ పథనం అవుతుందని, రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించే వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శిలు గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జావిద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్, పిసిసి మాజీ డెలిగేట్ ఈసా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతి రెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు తంబాకు చంద్రకళ, ఉషా, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, చందూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీపీ దశ గౌడ్, మాక్లుర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed