MLA Vemula : సంక్షేమ బడ్జెట్ కాదు… వంచన బడ్జెట్

by Kalyani |
MLA Vemula : సంక్షేమ బడ్జెట్ కాదు… వంచన బడ్జెట్
X

దిశ, భీంగల్ : ప్రజా సంక్షేమం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టేట్ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ లాగా లేదని వంచన బడ్జెట్ లా ఉందని గురువారం విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకోవడానికి ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వాగ్ధనాలపై ఈ బడ్జెట్ ఎగ్గొట్టే ప్రయత్నం చేశారన్నారు. కొన్ని హామీల ప్రస్తావన లేకపోగా, కొన్ని హామీలకు నిధుల కేటాయింపు లేదన్నారు. కొన్ని హామీలకు నిధుల సమీకరణ ఎలా చేస్తారో చెప్పనే లేదన్నారు. ఈ బడ్జెట్ అటు రైతులు, ఇటు మహిళలు, యువత, నిరుద్యోగులు ఇలా ప్రతి వర్గాల వారిని వంచించి, నిరాశపరిచే విధంగా ఉందన్నారు.

రూ. 4000 పెన్షన్, రూ. 2500 మహాలక్ష్మి పథకంలకు సంబంధించిన నిధులు ఈ బడ్జెట్ లో పొందుపరచ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ లో కోటి మంది మహిళలను వంచించిందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తులం బంగారు ఊసే లేదని, నిరుద్యోగ భృతికి నిధుల కేటాయించక 50 లక్షల మంది నిరుద్యోగులను నమ్మించారన్నారు. 25,000పోస్టుల మెగా డీఎస్సీ కి గాను 11000 పోస్టులతో డియస్సి అని బడ్జెట్ లో ప్రస్థావించరన్నారు. జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాల ప్రస్తావన లేదని, ఇందిరమ్మ ఇండ్లు ప్రకటనకే పరిమితమాయ్యాయని, నిధుల కేటాయింపు లేదన్నారు.

రైతు భరోసా, వరి బోనస్ కు బడ్జెట్ కేటాయింపు లేదని ఏకకాలంలో రూ. 31 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ. 6వేల కోట్లతో 11 లక్షల మందికి లక్ష లోపు రుణమాఫీ చేశారని, వివిధ కారణాలతో 25 లక్షల మందికి ఎగగొట్టారని ఏద్దేవా చేశారు. రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు నిధులు ఎలా సమీకరిస్తారో తెలియజేయలేదన్నారు. ప్రజలు ఎవరూ అడగని మూసి రివర్ ప్రక్షాళన అని పెద్ద కుంబకోణాన్ని కాంగ్రెస్ తెరలేపిందని ఆయన ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథను ఫెయిల్యూర్ చేసేందుకు గాను దానిపై మళ్ళీ డబ్బులు ఖర్చు పెడుతాం అంటూ డబ్బులు దండుకొనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.



Next Story