Nizamabad: గ్రామీణ ఓటర్లలో ‘ఆమె’దే ఆధిపత్యం.. పంచాయతీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

by Shiva |
Nizamabad: గ్రామీణ ఓటర్లలో ‘ఆమె’దే ఆధిపత్యం..  పంచాయతీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు స్పీడందుకున్నాయి. ఇందులో భాగంగా శనివారం ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ రాజ్ విభాగం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో , 545 గ్రామపంచాయతీలలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శనకు ఉంచారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే అధికారులు వాటిని స్వీకరించి పరిష్కరించనున్నారు.

జిల్లాలో గ్రామీణ ఓటర్లు 8,29,463

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 8,29,463 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,86,493 మంది కాగా, మహిళా ఓటర్లు 4,42,955 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లు 15 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

మండలాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే..

ఆర్మూర్ మండలంలో 43,483 ముందు ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 19,934 మంది కాగా, మహిళలు 23,548 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్ ఒకరున్నారు. బాల్కొండ మండలంలో 25,191 మంది ఓటర్లలో పురుషులు 11,610 మంది, మహిళలు 13,581 మంది ఉన్నారు. భీంగల్ లో 38,189 మందిలో పురుషులు 17654, మహిళలు 20534, ట్రాన్స్ జెండర్ ఒకరు, బోధన్ లో 47,831 మందిలో 22988, మహిళలు 24841, ట్రాన్స్ జెండర్లు ఇద్దరు, చందూర్ లో 8723 మందిలో పురుషులు 4200, మహిళలు 4523, ధర్పల్లిలో 31,293 మందిలో పురుషులు 15549, మహిళలు 16744, డిచ్ పల్లిలో 45,386 మందిలో పురుషులు 21083, మహిళలు 24,303, ఇందల్వాయిలో 30074 మందిలో పురుషులు 13962, మహిళలు 16111, ట్రాన్స్ జెండర్ ఒకరున్నారు.

జక్రాన్ పల్లిలో 34326 మందిలో పురుషులు 15858, మహిళలు 18468, కమ్మర్ పల్లిలో 29,277 మందిలో పురుషులు 13504, మహిళలు 15773, కోటగిరిలో 39935 మందిలో పురుషులు 19092, మహిళలు 20841, ట్రాన్స్ జెండర్లు ఇద్దరు, మాక్లూర్ లో 40213 మందిలో పురుషులు 18459, మహిళలు 21754, మెండోరా లో 20623 మందిలో పురుషులు 9511, మహిళలు11112, మోర్తాడ్ లో 26937 మందిలో పురుషులు 12404, మహిళలు 14533, మోస్రాలో 10235 మందిలో పురుషులు 4821, మహిళలు 5413, ఒకరు ట్రాన్స్ జెండర్, ముగ్ పాల్ లో 29935 మందిలో పురుషులు 13756, మహిళలు 16179, ముప్కాల్ లో 15906 మందిలో పురుషులు 7334, మహిళలు 8572, నందిపేట్ లో 57085 మందిలో పురుషులు 26217, మహిళలు 30865 మంది కాగా, ట్రాన్స్ జెండర్లు ముగ్గురు ఉన్నారు.

నవీపేట్ లో 45903 మందిలో పురుషులు 21382, మహిళలు 24521, నిజామాబాద్ రూరల్ మండలంలో 21223 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషుడు 10 వేల మంది కాగా, మహిళలు 11220 మంది, ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. రెంజల్ లో 29,112 మందిలో పురుషులు 13961, మహిళలు 15151, రుద్రూర్ లో 17073 మందిలో పురుషులు 8089, మహిళలు 8984, సిరికొండలో 33,260 మందిలో పురుషులు 15700, మహిళలు 17560, వేల్పూర్ లో 36,568 మందిలో పురుషులు 16704, మహిళలు 19864, వర్నిలో 26550 మందిలో పురుషులు 12734, మహిళలు 13816, ఎడపల్లిలో 30949 మందిలో పురుషులు 14429, మహిళలు 17519, ట్రాన్స్ జెండర్ ఓటరు ఒకరున్నారు. ఏర్గట్ల మండలంలో 14,183 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 6558 మంది కాగా, మహిళా ఓటర్లు 7625 మంది ఉన్నారు.

గ్రామీణంలో ఆమెదే ఆధిపత్యం

జిల్లాలోని పంచాయతీ ఓటర్లలో మహిళాధిక్యతే కనిపిస్తోంది. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 56,462 మంది ఎక్కువగా ఉన్నట్లు ముసాయిదా ఓటర్ జాబితాను బట్టి తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీలలో ముసాయిదా ప్రకారం 8,29,463 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 4,42,955 మంది, పురుషులు 3,86,493 మంది, ట్రాన్స్ జెండర్ లు 15 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఓటర్లలో మహిళలు ఎక్కువగా ఉన్నారు.

నేటి నుంచి అభ్యంతరాలకు అవకాశం

జిల్లా పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు అధికారులు అవకాశం ఇచ్చారు. రూరల్ అసెంబ్లీ ఓట్లను వార్డు, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలకు పునర్వ్యవస్థీకరించడంపై ఉన్న అభ్యంతరాలను శనివారం నుండి ఈనెల 21 వరకు స్వీకరిస్తారు.

రాజకీయ పార్టీలతో సమావేశం..

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు జిల్లాస్థాయిలో ఈనెల 18న జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహిస్తారు. 19న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండల స్థాయిలో సమావేశాలు జరగనున్నాయి.

అభ్యంతరాల కోసం ఇచ్చిన గడువు లోపు

తమ పరిశీలనకు వచ్చిన అభ్యంతరాలను ఈనెల 26న అధికారులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈనెల 28న వార్డులు, డివిజన్ లు వారీగా ఫోటో ఐడెంటిటీతో కూడిన తుది ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ రాజ్ శాఖ విడుదల చేయనుంది.

Advertisement

Next Story