అవినీతి అంతంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది: ఎం. పీ అరవింద్

by Disha Web Desk 9 |
అవినీతి అంతంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది: ఎం. పీ అరవింద్
X

దిశ, భీంగల్: అన్ని రంగాల్లో ఉన్న అవినీతి అంతంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని నిజామాబాద్ ఎం.పీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో చాయి పే పై చర్చ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. మోడీని మెప్పించ్చి పసుపు బోర్డు తెచ్చుకొన్నామని, ఈ క్రమంలో దానికి సంబంధించిన పరిశ్రమలు ఇతరత్ర పనులను ఎన్నికల తర్వాత ప్రారంభిస్తారని అన్నారు. 60 యేండ్ల పాలనలో తీసుకురావడానికి చేతకాని కాంగ్రెస్ వాళ్లు బోర్డు రాలేదు అంటున్నారని అది సమంజసమైనది కాదని తెలిపారు. గత 4 న మోడీ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుడా చెప్పడం జరిగిందన్నారు. ఈసారి పసుపు ధర అల్ టైం రికార్డ్ ధర. రూ. 20500 పలికిందని, ఈ ధరతో పసుపు అమ్మిన రైతు ఈ గ్రామానికి చెందిన వారెనన్నారు. భవిష్యత్తులో పంటల ధరలు ఎలా పెరగాలి, రైతులకు ఏవిధంగా లబ్ది చేకూరాలి అనే కాన్సెప్ట్ తోనే మున్ముందు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ గ్రామం పంటలు పండించడంలో, ముఖ్యంగా నాణ్యమైన పసుపు పండించడంలో పేరు గాంచిన వారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ డా. మల్లికార్జున్ రెడ్డి, మండల, గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story