మత్తు రాసిన మరణ శాసనం..తండ్రిని చంపిన కొడుకు

by Naveena |
మత్తు రాసిన మరణ శాసనం..తండ్రిని చంపిన కొడుకు
X

దిశ, బాన్సువాడ : మద్యం మత్తు విచక్షణను చిత్తు చేసింది. ఓ వ్యక్తి తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబం గ్రామంలో చోటుచేసుకుంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడు. అంబం గ్రామానికి చెందిన మహబూబ్ ఆదివారం రాత్రి మద్యం కోసం తండ్రి హైమద్(65)ను డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో గొంతు నులిమి చంపేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Next Story