- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందు చూస్తే ఒక రకం, వెనకాల చూస్తే మరో రకం..!
దిశ, పిట్లం : పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామంలోని హెల్త్ కేర్ వెల్ నెస్ సెంటర్ (పల్లె దావకాన)ను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ముందు భాగంలో పెయింటింగ్ వేశారు. కానీ అదే వెనుక భాగంలో చూస్తే కిటికీలు తలుపులు పుచ్చి పట్టి ఉన్నాయి. లోపల మాత్రం ఏలాంటి సౌకర్యాలు లేవు. బాత్రూములు వాడకంలో లేవు. ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఎలాంటి సౌకర్యాలు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ మెడికల్ ఆఫీసర్ ను వివరణ అడగడానికి సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు. తూతూ మంత్రంగా పల్లెదవాఖాన ముంగట పెయింటింగ్ వేశారు. కానీ లోపట మాత్రం బాత్రూం లేక అవస్థలు పడుతున్నామని పల్లె దవాఖానకు వచ్చే మహిళలు, గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా పల్లె దావకానకు మరమ్మత్తులు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఏదో తుతు మంత్రంగా ముగంట పెయింటింగ్ వేసి అదే మాత్రమే కొనసాగితే మంచిగా ఉండదని గ్రామప్రజలు తెలుపుతున్నారు. పిట్లం మండల మెడికల్ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా హాస్పిటల్ స్థితిగతులను చూసి వెళ్తున్నారా అనే సందేహం గ్రామ ప్రజలను వెంటాడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పల్లె దావఖానకు పూర్తిస్థాయి మరమ్మత్తులు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామప్రజలు కోరుతున్నారు.