ఎమ్మెల్యే VS జడ్పీ చైర్మన్.. అధికార పార్టీలో ఆధిపత్య పోరు

by Disha News Desk |
ఎమ్మెల్యే VS జడ్పీ చైర్మన్.. అధికార పార్టీలో ఆధిపత్య పోరు
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్ నియోజకవర్గం లో అధికార టీఆర్ఎస్ పార్టీ లో నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఆర్మూర్ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ల మధ్య ఉన్న విబేధాలు బాహటంగా విమర్శలు, ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరింది. మొదటి నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విట్టల్ రావుల మధ్య ఉప్పు నిప్పుగా ఉన్న విబేధాలు బాగా ముదిరాయి. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమల్లో తన ప్రోటోకాల్ పాటించడం లేదని జడ్పీ చైర్మన్ బహిరంగ వేదికల పై ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నే నియోజకవర్గం కు సుప్రీం అని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు అని నా నియోజకవర్గంలో పెత్తనం ఏ మాత్రం సహించను అన్నట్టు జీవన్ రెడ్డి వ్యవహార శైలి కొనసాగుతుంది.

ఆర్మూర్ నియోజకవర్గంలో 2018 వరకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిదే ఆధిపత్యం. జిల్లా పరిషత్ ఎన్నికల సందర్బంగా మాక్లూర్ జెడ్పీటీసీ గా విట్టల్ రావు కు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం జీవన్ రెడ్డి కీ మింగుడు పడలేదు. అప్పుడు జీవన్ రెడ్డి చక్రం తిప్పి విట్టల్ రావు ఓటమికి ప్రయత్నం చేశారు. ముందుగా ఈ విషయం పసిగట్టి ప్రతి పక్షులను పోటీలో లేకుండా చేసి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని నియోజకవర్గంలో టాక్ ఉంది. జడ్పీటీసీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ సుట్టరికం తో పాటు పార్టీ స్థాపన నుంచి ఉన్న విట్టల్ రావును జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వచ్చేలా చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు జిల్లా స్థాయి పదవుల పేచీ పెట్టింది. ఎమ్మెల్యే, క్యాబినెట్ పదవి గా పిలిచే జడ్పీ చైర్మన్ పదవి కారణంగా ఆర్మూర్ లో ప్రోటోకాల్ పంచాయతీ అధికారులకు, పార్టీలో జరిగే కార్యక్రమంలో కొత్త కొట్లాటకు వేదికను చేసింది.

ఆర్మూర్ నియోజకవర్గం లో జడ్పీ చైర్మన్ కు గుర్తింపు లేదని జడ్పీ చైర్మన్ వర్గం ఆరోపణలు చేస్తుంది. గడిచిన ఏడాది నందిపేట్ లోని లక్కం పల్లి సెజ్‌లో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కు ఘోర అవమానం జరిగింది. సర్పంచ్ మొదలు పార్టీ లీడర్ లవరకు సెజ్‌లో జరిగిన అధికారిక కార్యక్రమం లోకి అనుమతించిన పోలీసులు జడ్పీ చైర్మన్ ను అడ్డుకోవడం కలకలం రేపింది. దాని పై జడ్పీ చైర్మన్ అదే వేదిక పై జీవన్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత సమక్షంలో జరిగిన గొడవ పై ఏకంగా అధిష్టానం వరకు పిర్యాదులు వెళ్ళాయి. అది మొదలు కొని ఆర్మూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా మాక్లూర్ మండల కేంద్రంగా జరిగే కార్యక్రమాలకు పార్టీలో రెండు గ్రూప్ లు అయ్యాయి.

జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంకు ఎమ్మెల్యే వర్గం దూరంగా ఉంటుంది. అక్కడ పార్టీ పదవులు ఇతర ఎలాంటి అధికార పదవులు అని జీవన్ రెడ్డి కనుసన్నుల్లో జరుగుతున్నాయి. ఇది జడ్పీ చైర్మన్ వర్గం జీర్ణించుకోలేని పరిస్థితి. ఇటీవల పార్టీ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పార్టీ ఆందోళన కు పిలుపు నిస్తే జీవన్ రెడ్డి దాన్ని మాక్లూర్ మండలం పరిధిలోని నిజామాబాద్ - ఆర్మూర్ రహదారి పై చేసే వరకు వచ్చింది. అక్కడ కూడా జడ్పీ చైర్మన్ కు పిలుపు లేదు. దానితో చిర్రెత్తుకొచ్చింది జడ్పీ చైర్మన్ విట్టల్ రావు మాక్లూర్ మండలం లో జరిగిన రైతు బంధు సంబరాల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడు, పార్టీ ని ఎదగనివ్వడం లేదని చేసిన వాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో, పార్టీలో పెద్ద దుమారం రేపాయి.

Advertisement

Next Story

Most Viewed