- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉర్దూ మీడియం కళాశాలను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే
దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో జుక్కల్ శాసనసభ సభ్యులు హనుమంత్ షిండే ఉర్దూ మీడియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో ఏడు మండలాల్లోని పాఠశాలల్లో పదవ తరగతి వరకు ఉర్దూ మీడియం ఉందని అన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు ఇంటర్ లో ఉర్దూ మీడియం లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
ఉర్దూ మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని జూనియర్ కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, అలాగే ఉర్దూ మీడియం కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, సీఇసీ, హెచ్ ఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులందరూ అడ్మిషన్లు పొంది ఉర్దూ మీడియం కోర్సులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, ఎంపీపీ అశోక్ పటేల్, వివిధ మండలాల కోఆప్షన్ మెంబర్లు, వివిధ మండలాల ఎంపీపీలు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.