‘మన ఊరు మనబడి’ కింద రూ.1.49 లక్షలు నిధులు మంజూరు.. ఎమ్మెల్యే హన్మం త్ షిండే

by Javid Pasha |
‘మన ఊరు మనబడి’ కింద రూ.1.49 లక్షలు నిధులు మంజూరు.. ఎమ్మెల్యే  హన్మం త్ షిండే
X

దిశ నిజాంసాగర్: ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల నూతన భవన నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శంకుస్థాపన చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ ఆర్ జి ఎస్ పథకం కింద అచ్చంపేట జిల్లా పరిషత్ పాఠశాల భవన నిర్మాణానికి 83 లక్షలు, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి 66 లక్షలు నిధులు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అచ్చంపేట గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి 20 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

అచ్చంపేటలోని గురుకుల పాఠశాల ఆవరణలో డైనింగ్ హాల్, వంటగది, మండల ప్రజా పరిషత్ నిధుల కింద మంజూరైనటువంటి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా చైర్మన్ దాఫెదర్ రాజు, ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, అచ్చంపేట గ్రామ సర్పంచ్ అనసూజ సత్యనారాయణ, గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, హసన్పల్లి సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, పంచాయతీరాజ్ ఏఈ సురేష్ కుమార్, సి డి సి చైర్మన్ గంగారెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు గైని విఠల్, అఫ్జల్, ప్రవీణ్ కుమార్, పాల్గొన్నారు.

Advertisement

Next Story