మిషన్ భగీరథ నీటినే త్రాగాలి : అడిషనల్ కలెక్టర్

by Kalyani |
మిషన్ భగీరథ నీటినే త్రాగాలి :  అడిషనల్ కలెక్టర్
X

దిశ,నిజాంసాగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మిషన్ భగీరథ నీటినే త్రాగలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నిజాంసాగర్ మండలంలోని మార్పల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరఫరా పై అవగాహన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. గ్రామ పంచాయతీ మోటార్ల ద్వారా సరఫరా చేసే నీటి కంటే మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసే నీరు ఫిల్టర్ చేయబడి, పోషకాలు సంవృద్ధిగా ఉంటాయని సూచించారు. దీంతో ఫ్లోరైడ్ సమస్య రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా గ్రామ ప్రజలు ఎలాంటి కలుషిత నీటి వ్యాధుల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని తెలిపారు.

మర్పల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా అవుతున్నప్పటి నుండి ఆ నీటిని త్రాగకుండా గ్రామ పంచాయితీ మోటార్ల ద్వారా సరఫరా చేసే నీటిని త్రాగుతున్నారని సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మిషన్ భగీరథ నీటిని త్రాగే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో అవగాహన కార్యక్రమం అనంతరం గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగేందుకు సముఖంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచినీటి సరఫరా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తహసీల్దార్ బిక్షపతి, డిఈ సురేష్, ఏఈ సుమలత, ఎంపీడీఓ గంగాధర్,ఎంపీఓ యాదగిరి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ చందురి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed