- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో మెగా జాబ్ మేళా..
దిశ, కామారెడ్డి రూరల్ : ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో హెచ్సీఎల్ టెక్ బీ కంపెనీ ఆధ్వర్యంలో ఈ నెల 8న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు 2022, 23 ఎంపీసీ, ఎంఈసీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉదయం 9 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు అర్హత పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, హాల్ టికెట్, ఆధార్ కార్డునకలు, ఆండ్రాయిడ్ మొబైల్ తో డ్రైవ్ స్థలానికి తప్పకుండా హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఎల్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ఎస్. శ్రీనివాస్ పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఈ క్రింది సెల్ఫోన్ నెంబర్ను సంప్రదించాలని 8074065803, 9493553821 పేర్కొన్నారు.