- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కాడు... చివరకు...
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కాడు... చివరకు...
by S Gopi |
X
దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన గూడెల్లి కిరణ్ అర్హుడైనప్పటికీ తనకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని మనస్తాపానికి గురై వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేవరకు కిందికి రానని భీష్మించుకు కూర్చున్నాడు. సుమారు గంటపాటు ట్యాంక్ పైనే ఉండి హల్చల్ చేయడంతో దేవునిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కిరణ్ ను సముదాయించారు. అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కిరణ్ కిందకు దిగాడు. అలాగే దేవునిపల్లికి చెందిన నీల దివ్య అనే మహిళ కూడా తనకు డబుల్ బెడ్ రూమ్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే ఆమెకు ఆపరేషన్ కావడంతో ట్యాంక్ ఎక్కడానికి అవస్థపడింది. దీంతో గ్రామస్తుల కోరిక మేరకు ఆమె కిందికి దిగింది.
Advertisement
Next Story