దేశానికి, రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీ రామరక్ష.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

by Sumithra |
దేశానికి, రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీ రామరక్ష.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..
X

దిశ, భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్రరోడ్లు, భవనాలు శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్దికి ఆకర్షితులై కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ, బీఎస్పీ పార్టీల నుండి పలువురు ఆదివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కావాలనే డిమాండ్ ప్రజల్లోంచి వస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామరక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

పార్టీలో చేరిన వారు..

కొమ్ముల వెంకన్న, కొట్టాల రాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, బేల్దారి సందీప్, బేల్దారి ప్రవీణ్, వంజరి గణేష్, ఏలేటి రాంచందర్, కుర్మామహేష్ చేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారు శంకర్, పార్టీ ప్రెసిడెంట్ అరెల్లి నవీన్, మాజీ సర్పంచ్ రాజన్న, కొమ్ముల రాజేందర్, బట్టు అశోక్, రాజేశ్వర్, సుమన్, మహేష్, ముతేన్న, తోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story