Ration mafia : పట్టపగలే దర్జాగా రేషన్ దందా

by Aamani |
Ration mafia : పట్టపగలే దర్జాగా రేషన్ దందా
X

దిశ, ఎల్లారెడ్డి : రేషన్ బియ్యం దందా మాఫియా గా మారింది. గ్రామాలు పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించిన బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్న రైస్ మిల్లులకు చేరవేయాలి అన్న జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది. రెండు దశాబ్దాల క్రితం గ్రామీణ పట్టణ స్థాయిలో రేషన్ దుకాణాలలో కొనుగోలు చేసి కమిషన్ మీద అమ్ముకునే చిరు వ్యాపారులు ఈ దందాను సాగించినప్పటికీ ప్రస్తుతం వ్యక్తి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు కూడా బియ్యం సరఫరా చేసే స్థాయికి ఎదిగాడు.

లక్షల్లో మామ్ముళ్లు..

రేషన్ బియ్యం పక్కదారి పట్టణంలో అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖల అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ పిడిఎఫ్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన పౌరసరఫరాల శాఖలోని జిల్లా స్థాయి అధికారుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని వివిధ శాఖలో హోదాలో ఉన్న వారి వరకు బియ్యం బందా సాగించే వారికి సహకారం అందిస్తున్నట్లు భావిస్తున్నారు ప్రజలు. మామూలు ఇవ్వలేని గ్రామ మండల స్థాయిలోని ఆటో ట్రాలీలను అప్పుడప్పుడు సీజ్ చేసి అధికారులు కంటిచూపు చర్యలు తీసుకుంటున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల్లో గ్రామాల్లోని పలువు రేషన్ డీలర్లు నెలలో మూడు రోజులు నాలుగు రోజులు గ్రామంలో కొందరికి బియ్యం పంపిణీ చేసి పట్నం చేరుకొని పట్నంలోని ప్రజలకే తమ బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో మండిపడుతున్నారు ప్రజలు. సామాన్య ప్రజలకు అందాల్సిన బియ్యం పల్లె నుంచి పట్నంలో విక్రయం జరగడంతో పేద ప్రజలకు కడుపు మండుతుంది. కనీసం కూడా పేదల పట్ల కనికరం లేకుండా బియ్యాన్ని అమ్ముకోవడంలో వారి దర్జా తనమే వేరు.

బియ్యానికి బదులు డబ్బులు

ప్రస్తుతం చాలామంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తినడం లేదు. దీంతో ప్రతి నెల బియ్యం మిగిలిపోతుంది దీని గ్రహించిన కొంతమంది డీలర్లు వారిని కలిసి బియ్యం తీసుకున్నట్లు వేలిముద్ర వేయాలని, అందుకు కిలో బియ్యానికి ఎనిమిది నుంచి పది రూపాయల చొప్పున ఇస్తామని మాట్లాడుకుని, లబ్ధిదారులు కూడా డీలర్లు చెప్పినట్టే చేస్తున్నప్పటికీ అదే బియ్యాన్ని పట్నానికి చేర్చి 15 నుండి 20 రూపాయలు 25 రూపాయలు కిలో చొప్పున డీలర్లు విక్రయిస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి మండలం నాగిరెడ్డిపేట మండలం లో పలు దుకాణాలలో దర్జాగా ప్రజలకు చేరవలసిన ఉచిత రేషన్ బియ్యంను పట్టణానికి చేర్చి సొమ్ము చేస్తున్నారని అధికారులకు తెలియపరచినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లారెడ్డి మండలంలోని దుకాణం నెంబర్ 29 22 0 21, 29 22 0 24, ఈ రెండు దుకాణాలు ఒకే వ్యక్తి నిర్వహిస్తుంటాడు. ప్రతి నెల మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే ఇక్కడికి వచ్చి దుకాణం నిర్వహిస్తూ మిగతా రోజుల్లో హైదరాబాద్ ఉంటాడు హైదరాబాద్ లో ఉంటూ అక్కడ ఒక ఈ పాస్ మిషన్, వేయింగ్ మిషన్ ఉంటుంది. వాటి ద్వారా వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి ట్రాన్సాక్షన్ చేస్తూ వారికి బియ్యం విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ అధికారులకు తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ రెండు దుకాణాలే కాకుండా నాగిరెడ్డిపేట మండలం లో కూడా పలు గ్రామాల్లో రేషన్ దుకాణదారులు దర్జాగా దందా సాగిస్తున్నారని పావుర సరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలిసినప్పటికీ కూడా వాటిపై చర్యలు తీసుకోకపోవడం ప ఏమిటో అని ప్రజలు నివ్వెరపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకుని విచారణ జరిపించి అక్రమ బియ్యం తరలింపు డీలర్ల పై చర్యలు తీసుకోవాలని అక్రమాలకు పాల్పడిన రేషన్ డీలర్ల పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.



Next Story