- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం పీకల దాకా కూరుకుపోయింది..
దిశ, నిజామాబాద్ సిటీ : లిక్కర్ కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించే జర్నలిస్టుల పై ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల సమాజం నివ్వెర పోతుందని లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్రఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ పక్ష నాయకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం అందజేస్తున్నారా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న కార్యాలయం పై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా దాడి గురైన తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయడం ఏంటని అన్నారు.
తెలంగాణలో నాలుగు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పనితనం ఏ విధంగా ఉందో అర్థం అవుతుందని విమర్శించారు. తిండి తిప్పలు మానేసి కష్టపడి చదివిన అభ్యర్థులకు ఉద్యోగం రాలేదని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పగడ్బందీగా ఉండే టీఎస్పీఎస్సీ ఆఫీసులో పెన్ డ్రైవ్ ద్వారా పేపర్ కాఫీ చేయడం అంత ఆశామాషీ కాదని, ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమైందని ఆరోపించారు. నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగిందని ఆరోపించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి దీనికి బాధ్యతవహిస్తూ రాజీనామా చేయాలని యెండల డిమాండ్ చేశారు. మంత్రివర్గం నుండి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో యోగి పాలనలో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందడం లేదని, కమిషన్ లకు కక్కుర్తి పడి అర్హులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వ్యవసాయ భూములు అర్సపల్లి శివారులో 50 సంవత్సరాల క్రిందట పట్టా భూమి రెండు ఎకరాల 16 గుంటలు సారంగాపూర్ దళితుల కోసం ఇచ్చిన భూమి, స్వస్థత వాటి కోసం కేటాయించిన స్థలాన్ని, సంబంధిత తహసిల్దార్ చూపించిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో పేద దళితులు ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను ఎన్నిసార్లు కలిసి అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని అన్నారు. ఒక అధికారి న్యాయబద్ధంగా పనిచేసే విధంగా చేస్తే తనమీద అట్రాసిటీ కేసు పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు.
ఇలాంటి వ్యక్తులు పాలనకు అనర్హులని వాస్తంగా వీరు లోపల ఉండాల్సిన వాళ్లు, గడ్డ మీద కూసున్నటువంటి పరిస్థితి ఉందని, షాడో మేయర్ గా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్, కమిషనర్ జర పేదల గోడు వినండి అంటూ భారతీయ జనతా పార్టీ నుండి కోరుతున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ, ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, అర్బన్ అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, మాజీనగర అధ్యక్షుడు ఎండల సుధాకర్, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ శర్మ, నాయకులు గంగాధర్, శీల శ్రీనివాస్, బద్దంకిషన్, ప్రతాప్ బంటు, ప్రవీణ్, మీసేవ శ్రీనివాస్, ఆది నరేందర్, బాలరాజ్, రషీద్, మునీర్, లింబాద్రి, చైతన్య కులకర్ణి, లక్ష్మణ్, సుందర్ సింగ్ రాథోడ్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.