Government Adviser Shabbir Ali : మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిది..

by Sumithra |
Government Adviser Shabbir Ali : మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిది..
X

దిశ, కామారెడ్డి : ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుని పై ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. 75వ వనమహోత్సవంలో భాగంగా పచ్చదనం - స్వచ్చదనం కార్యక్రమాన్ని కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు మంచి ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటిన చెట్లను సంరక్షించ లేరన్నారు. కామారెడ్డి పట్టణానికి ప్రత్యేక నిధుల ద్వారా 240 కోట్లతో జలాల్ పూర్ నుంచి మల్లన్న గుట్ట వరకు త్రాగునీరు పైప్ లైన్ల కొరకు నిధులు మంజూరయ్యాయన్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీకి అమృత్ స్కీంమ్ కింద 93 కోట్ల పనులకు టెండర్లు పూర్తైనట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, కామారెడ్డి నియోజకవర్గానికి సాగునీటి కోసం ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పథకం కింద 1200 కోట్లు అవసరముండగా సీఎం రేవంత్ రెడ్డి 200 కోట్లు మంజూరు చేశారన్నారు. దీని ద్వారా 2,54,000 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కామారెడ్డి పట్టణంలో కరెంటు సమస్య లేకుండా తీర్చడానికి త్వరలో కామారెడ్డి పట్టణానికి ప్రత్యేక నిధుల ద్వారా 133/11 సబ్ స్టేషన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుండి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇంధుప్రియా, వైస్ చైర్ పర్సన్ వనిత, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed