- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పరిశ్రమల అభివృద్ధి కి ఐటీ హబ్ ఒక ఆరంభం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఒక ఆరంభం లాంటిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం నిజామాబాద్‌లోని ఐటీ హబ్ భవన పనులను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఐటీ హబ్‌కు సంబందించిన వెబ్ సైట్ గురించి బీఆర్ఎష్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్ గుప్తా ఎమ్మెల్సీ కవితకి వివరించారు. ఐటీ హబ్ నిజామాబాద్ వెబ్ సైట్‌ను ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నిజామాబాద్ యువతకు శుభ వార్త అని త్వరలో ఐటీ హబ్ ప్రారంభిస్తామన్నారు. మరేన్నో పరిశ్రమలు నిజామాబాద్‌కు రానున్నాయని నిజామాబాద్‌లో ఐటీహబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ద తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
యువత కు ఉపాధి కల్పన లక్ష్యం గా చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని,అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఇతర జిల్లాల ఐటి హబ్‌లతో పోల్చుకుని లోటుపాట్లను సరిదిద్ది నిజామాబాద్ ఐటీహబ్‌ను ఏర్పాటు చేసుకున్నా మన్నారు. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన దీనిలో 750 మంది యువతకు అవకాశాలు లభించనున్నాయని అన్నారు.
ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తయ్యాయని, దేశ వ్యాప్తంగా ఐటి ఎక్స్ పోర్ట్ లో రెండవ స్థానంలో ఉన్నామన్నారు. మూడు నుండి నాలుగు వేల మంది ఇతర ప్రాంత వాసులకు అవకాశం ఇవ్వనున్నట్లు, త్వరలో మరింత విస్తరిస్తామన్నారు. తెలంగాణ లో కలలు కన్న ప్రగతి సాధ్యమౌతుందన్నారు.
భవిష్యత్తు ప్రణాళిక తో నిర్మాణాలు చేయించిన ఎమ్మేల్యే గణేష్ ,ఎన్నారై కొడినేటర్ మహేష్ బిగాలకు అభినందనలు తెలిపారు. డిగ్రీ కళాశాలలతో ఒప్పందాలు పెట్టుకుంటామని, మరింత అభివృద్ది సాధించేందుకు ముందుకెళ్తామన్నారు.జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కవిత అన్నారు.