- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి వారి ప్రోత్సాహమే కారణమం..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తండ్రి ఎండీ జమీల్ అహ్మద్ భావోద్వేగానికి గురయ్యారు. అవార్డుల ప్రధాన వేదికపై మాట్లాడిన జమీల్ అహ్మద్ నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
ఒక తండ్రిగా తాను చేసింది కొంతేనని, కేసీఆర్, కవితల సహకారం లేకపోతే నిఖత్ జరీన్ ఈ స్థాయికి వచ్చేది కాదని జమీల్ అహ్మద్ భావోద్వేగానికి గురయ్యారు. జమీల్ అహ్మద్ ప్రసంగానికి సభికులు చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటింది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నిఖత్ జరీన్ నామినేట్ అయింది.