నగరంలో కత్తుల కలకలం.. మళ్ళీ ఏం జరుగుతుందోనని భయం భయం

by Sumithra |
నగరంలో కత్తుల కలకలం.. మళ్ళీ ఏం జరుగుతుందోనని భయం భయం
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది. గత ఐదు నెలల్లో నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు రౌడిషీటర్లు హత్యకు గురయ్యారు. ఇటీవల జరిగిన రౌడిషీటర్ ఆరీఫ్ ఢాన్ హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపగా మరొకరు ఇప్పటికి పోలీసులకు చిక్కలేదు. అయితే హత్యలు ప్రతికార హత్యలతోనే నగరంలోని ఒక ప్రాంతం భయాందోళనకు గురవుతుంది. ఆరీఫ్ డాన్ హత్య కేసులో నిందితులు జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతారా అని మరో వర్గం కాచుక కూర్చుందన్న టాక్ వినబడుతుంది. ఈ నెల 19న ఎన్ఆర్ఐ కాలనీకి చెందిన వ్యక్తి పై కొందరు కర్రలతో దాడి చేసి కత్తులతో చంపుతామని బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈ విషయంలో పోలీసులు కేసునమోదు చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఆటోనగర్ కొత్త బ్రిడ్జి వద్ద జంగల్ ఇబ్బు హత్య కేసులో ఉన్న వ్యక్తులపై దాడి జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరికి కత్తుల గాయాలయ్యాయి. కత్తితో జరిగిన దాడిని అడ్డుకోవడంతో వేళ్లు తెగిపోయాయి. ఉద్దేశ్యపూర్వకంగా చిన్నగొడవ విషయంలో జరిగిన ఘర్షణ కత్తులు తీసుకుని దాడి చేసే వరకు వెళ్లింది. ఆరీఫ్ డాన్ తో పాటు ఇద్దరు యువకులు డిసెంబర్ 31న జంగల్ ఇబ్రహీంను హత్య చేసిన కేసులో ఉన్నారు. బుధవారం రాత్రి జరిగిన దాడి ఉద్దేశ్యపూర్వకంగానే అని చెబుతున్నారు. ఇప్పటికి ఆరీఫ్ డాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తుండగా ప్రత్యర్థి వర్గం కూడ అంతే స్థాయిలో వెతుకుతుండడంతో మైనార్టీ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమౌతుంది.

పోలీసులు రౌడియిజాన్ని రూపుమాపేందుకు యత్నిస్తుండగా అంతేస్థాయిలో చిన్న విషయాలకే హత్యలు చేసే కల్చర్ పెరుగడం ఆందోళన కలిగిస్తుంది. పదుల సంఖ్యలో రౌడిషీటర్లు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గా మారారు. వారికి గతంలో కౌన్సిలింగ్ ఇచ్చిన తీరు మారకపోగా ప్రత్యర్థుల పై దాడులకు అవకాశం కోసం ఎదురు చూస్తుండడం పోలీసు అధికారులకు కూడా మింగుడు పడడం లేదు. ఎలక్షన్ బిజీ సమీపిస్తుండగా పోలీసుల ట్రాన్స్ ఫర్లు ఉన్న నేపథ్యంలో ఎక్కడ తమ పోస్టింగ్ లకు రౌడిల హత్యలు మెడకు చుట్టుకుంటాయోనని అధికారులే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది.

Advertisement

Next Story