బడాభీంగల్ లో భారీవర్షం

by Sridhar Babu |
బడాభీంగల్ లో భారీవర్షం
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : భీంగల్ మండలం బడాభీంగల్​తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో శుక్రవారం రాత్రి సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి బడాభీంగల్​ ఊరచెరువు అలుగు పోస్తుంది. శుక్రవారం ఈదురు గాలులు, భారీవర్షం కారణంగా రహదారి వెంట చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. రోడ్లపై రైతులు ఆరబోసిన మక్కలు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. ఆరబోసిన మక్కలను సంచుల్లో నింపేందుకు అవకాశం లేకపోవడంతో రోడ్డుపై అలాగే వదిలేశారు. దీంతో మక్కలు తడిసిపోయాయి. చేంగల్, బడాభీంగల్ గ్రామాల శివారులో రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిసిపోవడంతో వాటికి బూజు పట్టకుండా ఆరబెట్టుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed