మల్లారం అటవీ ప్రాంతంలో మంటలు

by Disha Web Desk 15 |
మల్లారం అటవీ ప్రాంతంలో మంటలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం అటవీ ప్రాంతం నిప్పంటుకుని దగ్ధమవుతుంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. ఎండ వేడిమితో మల్లారం అడవీ ప్రాంతంలో గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి వ్యాప్తి చెందాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలు సమయంలో అడవిలో మంటలు వ్యాపించాయి.

ఎండాకాలం కావడంతో చెట్లు ఎండిపోయి, ఆకులు రాలి నేలపై ఉండడంతో ఈ మంటలు కొద్దికొద్దిగా అటవీ అంతటా వ్యాప్తి చెందుతున్నా సంబంధిత ఫారెస్ట్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. అటవీ ప్రాంతం దగ్ధమైతే అందులో అటవీ జంతువులు జనవాసంలోకి వచ్చే ప్రమాదం ఉంది. కావున ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వీడి మల్లారం అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story