‘అయితే తిట్టు.. లేదంటే ఒట్టు’.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

by Disha Web Desk 19 |
‘అయితే తిట్టు.. లేదంటే ఒట్టు’.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో పోరాడింది బీఆర్ఎస్సేనని.. బీసీల కోసం గళం విప్పింది మేమేనని రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే సీఎం పదవి పోతుందని భయం పట్టుకుందన్నారు. అందుకే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రేవంత్ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. అయితే తిట్టు.. లేదంటే ఒట్టు అన్నట్లుగా సీఎం రేవంత్ విధానం ఉందని మండిపడ్డారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తు్న్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలపై ప్రేమ ఉన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఈటల గెలుస్తాడని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కచ్చితంగా పరిశీలన ఉంటుందని, మల్లారెడ్డి సందర్భోచితంగా మాట్లాడారని అనుకుంటున్నామన్నారు. అన్నీ పరిశీలించాక మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హరీష్ రావు స్పష్టం చేశారు. మరీ ప్రధాని మోడీని బడే బాయ్ అని రేవంత్ పొగిడితే కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ పొగిడితే ఆయనపై బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదని నిలదీశారు.



Next Story

Most Viewed