- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు దినోత్సవాలు ఒక వైపు.. ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురు చూపులు మరోవైపు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించి నెల రోజులు గడుస్తున్నా డబ్బు చేతికి రాకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తూకం వేసిన రెండు రోజుల్లో డబ్బులు చెల్లిస్తామనే ప్రకటనలు ఆచరణలో అమలు కావడం లేదు. రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట సంబరాలు నిర్వహిస్తుంది. రెండో రోజు అయిన శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రధానంగా రైతులతో, మార్కెట్ యార్డులలో, రైతు వేదికల వద్ద ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ధాన్యం సేకరించిన రోజుల్లోనే వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తామని చెబుతున్నా అది అమలు కావడం లేదు. దీంతో పంట మార్పిడి, కోతలు, మిషన్ల కోసం, కూలీల కోసం చేసిన అప్పులు పెరిగి లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 900 కోట్ల ధాన్యం తాలూకు డబ్బులు రైతుల ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం సంబరాలు నిర్వహిస్తుండగా రైతులు మాత్రం ధాన్యం డబ్బులు మహాప్రభో వేడుకుంటున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో శనివారం వరకు 6,14,197 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. దాని తాలూకు రైతులకు రూ.1265.24 కోట్లు చెల్లించాల్సి ఉంది. శనివారం వరకు 3,33,0 38 మెట్రిక్ టన్నుల ధాన్యంకు సంబంధించి 686.06 కోట్లు మాత్రమే చెల్లించారు. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించేందుకు రూ.250. 70 కోట్ల ఇండెంట్ పెట్టిన నిధులు విడుదల కాలేదు. జిల్లాలో కేవలం 60,255 మంది రైతులకు మాత్రమే చెల్లింపులు జరిగా యి. జిల్లాలో మరో 600 కోట్ల ధాన్యం డబ్బుల కోసం రైతులకు ఇప్పటికి ఎదురుచూపులు తప్పడం లేదు. ధాన్యం సేకరణలో తరుగు తీస్తున్నారు కాపాడండి అని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా పట్టించుకోలేదు.
దాదాపు ఒక్కొక్క క్వింటాల్ కు 7 కిలోల నుంచి 10 కిలోల తరుగు తీసినా ఒక్క రైసుమిల్లుపై కూడా ఉమ్మడి జిల్లాలో చర్యలు తీసుకోలేదు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వద్ద ఉన్న డబ్బులతో ధాన్యం కొనుగోలు చేసి చెల్లింపులు చేసిన తర్వాత కార్పొరేషన్ అధికారులు చెల్లింపుల విషయంలో చేతులెత్తేశారు. కామారెడ్డి జిల్లాలో 344 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేశారు. అందులో 340 మాత్రమే తెరిచి 337 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 170 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. మిగిలిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,23,2 74.160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. జిల్లాలో 665.94 కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించవలసి ఉంది.
కానీ శనివారం వరకు 552.90 కోట్ల ధాన్యం తాలూకు వివరాలను ట్యాబ్‌లో ఎంట్రీ చేశారు. 525. 37 కోట్ల ధాన్యం తాలూకు ట్రక్ షీట్లను మాత్రమే రూపొందించారు. మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం విలువ 498.37 కోట్లుగా చెబుతున్నారు. శనివారం నాటికి జిల్లాలో రూ.348. 65 కోట్లు మాత్రమే చెల్లించారు. 1,69,24 5.295 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే డబ్బులు చెల్లించారు. ఇంకా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులు చెల్లించాలి. జిల్లాలో 58,968 మంది రైతుల నుంచి 3,23,25 7.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా కేవలం 32,480 మంది రైతులకు 1,69,848 మెట్రిక్ టన్నుల ధాన్యం కు సంబంధించిన 348 కోట్లు మాత్రమే చెల్లించారు. దాదాపు 310 కోట్ల వరకు ధాన్యం డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
Read More... ఊహించని రీతిలో బెడిసికొట్టిన సర్కార్ ప్రతిష్టాత్మక నిర్ణయం.. అరిగోస పడుతున్న లక్షలాది రైతులు!