- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి. .
దిశ, ముధోల్ : విద్యుత్ స్తంభం పడిపోయి, విద్యుత్ తీగలు పంట రక్షణ కంచె పై పడటంతో విద్యుత్ షాక్ తగిలి రైతు అక్కడక్కడ మృతి చెందిన సంఘటన మండలంలోని మచ్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళ్తే ఎస్ఐ సాయికిరణ్, స్థానికుల కథనం ప్రకారం మండలంలోని మచ్కల్ గ్రామానికి చెందిన రైతు ఆనందరావు పటేల్ (68) తన వ్యవసాయ చేనుకు బుధవారం ఉదయం వెళ్ళాడు. అయితే తన చేన్లో సాగు చేసిన వేరుశనగ పంటకు అడవి జంతువుల నుండి కాపాడుకోవడానికి రక్షణ కంచె వేయించాడు.
అయితే వ్యవసాయ బోరు బావిల కనెక్షన్ల కోసం వేసిన విద్యుత్ స్తంభం గాలి, వానకు కూలి పై ఆ విద్యుత్ తీగలు పక్కనే ఉన్న కంచె పై పడింది. ఎప్పటిలాగే రైతు వేరుశనగ పంటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, విధ్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే రైతు మృతి చెందాడు. తన పంట చుట్టు ఉన్న రక్షణ కంచె పై విద్యుత్ పడటంతో దీన్ని రైతు గమనించక పోవటంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీన్నీ గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలిసులకు సమాచారం అందించారు. మృతుడికి బార్య , కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.