రూ.6 లక్షల విలువైన నకిలీ డ్రగ్స్ పట్టివేత

by Sridhar Babu |
రూ.6 లక్షల విలువైన నకిలీ డ్రగ్స్ పట్టివేత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రూ.6 లక్షల విలువైన నకిలీ డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరళ ఆధ్వర్యంలో ఏడీ డా.నర్సయ్య, డ్రగ్ ఇన్​స్పెక్టర్ శ్రీకాంత్, శ్రీలత దాడులు నిర్వహించారు. అక్కడ నిల్వ ఉంచిన రూ.6 లక్షల విలువైన నకిలీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఏడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాంఫార్మాసుటికల్ కంపెనీపై దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన స్థానిక బయోమెడిక్ ఫార్మాసుటికల్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో కూడా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండా ఫుడ్ లైసెన్స్ తోనే డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండా క్యూపీ ఫార్మచెం లిమిటెడ్ పేరుతో రహస్యంగా మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత ఆపరేటర్ షేక్ సుబాని ఇచ్చిన వాంగ్మూలం మేరకు రామఫార్మాసుటికల్ యజమానులైన రంజిత్ కుమార్, స్రవంతిల ఆదేశాల మేరకు డ్రగ్స్ ను తయారు చేసి నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల బయోమెటిక్ ఫార్మాసుటికల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ట్రాన్స్ పోర్టు ద్వారా, డైలీ ఫార్మల్ సేవల ద్వారా పంపుతున్నామని చెప్పడంతో ఈ దాడులు నిర్వహించామని వారు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బయోమెడిక్ ఫార్మాసుటికల్ ప్రైవేట్ లిమిటెడ్ వారిపై డీఎన్ సీ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story