- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
16 వీడియో స్క్రీన్ వాహనాల ప్రారంభం..
దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి 16 వీడియో స్క్రీన్ వాహనాలను ఏర్పాటు చేయించి ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు ఆశన్న గారి జీవన్ రెడ్డి మహమ్మద్ షకీల్ అమీర్ లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ స్క్రీన్ లతో ఏర్పాటు చేయించిన 16 ప్రచార రథాల వాహనాలు మహారాష్ట్రలోని కాందార్ లోహ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తాయన్నారు.
ఈ నెల 26వ తేదీన సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని కాందార్ లోహాలో భారీ బహిరంగ సభ పెట్టనున్న నేపథ్యంలో తెలంగాణలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలు అక్కడి ప్రజలకు వివరించడం కోసమే ఈ భారీ స్క్రీన్ లతో కూడిన వాహనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో తిప్పనున్నట్లు ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రచార రథాలు మహారాష్ట్రలోని 1600 గ్రామాల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలు మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.