Collector : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సమస్యల పరిష్కారానికి కృషి

by Kalyani |
Collector : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సమస్యల పరిష్కారానికి కృషి
X

దిశ, కామారెడ్డి : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ కాలనీని ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియతో కలిసి పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నెలకొన్న సమస్యలు, ఇంకా చేపట్టాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి పట్టణంలో వార్డుల వారీగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మాస్ క్లీనింగ్ గురించి జిల్లా కలెక్టర్ కు చైర్మన్ వివరించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో జోన్ 1, జోన్ 2 గా మాస్ క్లీనింగ్ పనులు చేపడుతున్నమన్నారు.

గత ఆరు నెలలుగా డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నెలకొన్న మురికి కాలువలను శుభ్రం చేయాలని కోరగా వెంటనే స్పందించినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారుల సమస్యల పరిష్కారం చేస్తామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ జహీరా బేగం యామిన్, తేజపు మానస ప్రసాద్, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, రవి గౌడ్, ఇల్లందుల లతా వేణు, కాలనీవాసులు పాల్గొన్నారు.



Next Story