- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు : మంత్రి జూపల్లి
దిశ,ఆర్మూర్ : వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులను కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి , నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ ఏరియాలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం రాష్ట్ర మంత్రి పరిశీలించి, రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వాటి తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధాన్యం కొనుగోలు ఆలస్యం గురించి, గత ఎన్నికల్లో ధాన్యానికి ఇస్తానన్న క్వింటాల్ కురూ. 500 బోనస్ గురించి మంత్రిని అడిగారు.
దీంతో మంత్రి జూపల్లి తప్పకుండా సన్న రకం వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన రైతులకు తప్పకుండా రూ.500 బోనస్ ఇస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లపాటు రైతులను నిలువు దోపిడీ చేసిందన్నారు. రైతుల బాగు కోసం ఏనాడు ఆలోచన చేయలేదని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే 5 నుంచి 10 శాతం కోత పెట్టిందని, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ విధంగా జరగవద్దన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు,బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నాయన్నారు. గత 70 సంవత్సరాలు పాలించిన కాలంలో గతంలోని ప్రభుత్వాలు చేసిన 60 వేల కోట్ల అప్పును, గత బీఆర్ఎస్ కెసిఆర్ పరిపాలనలో 8 లక్షల కోట్లకు అప్పును పెంచారని మంత్రి జూపల్లి విమర్శించారు.
అంతకుముందు 44, 63 నంబర్ల జాతీయ రహదారుల జంక్షన్ వద్ద పెర్కిట్ బైపాస్ వద్ద రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జిలు వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ లు పట్టు శాలువాలతో ఘనంగా సన్మానించి అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్చార్జిలు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పెర్కిట్ సొసైటీ చైర్మన్ పెంట బోజారెడ్డి, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.