- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
అస్తవ్యస్తంగా జ్యోతిబాపూలే గురుకుల నిర్వహణ..
దిశ, పిట్లం : గ్రామీణ ప్రాంత బాలికలను విద్యాపరంగా చైతన్యపరిచే విధంగా ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతున్నది. జ్యోతిబాపూలే నిర్వాహకుల ఒప్పంద ప్రకారం భవన యజమానులు అన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోయిన్నప్పటికి గురుకుల పాఠశాల అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థినిలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన బాత్రూములలో మురికి నీరు సైతం వసతి గృహాల చుట్టూ చేరడంతో దోమలు, క్రిమి కీటకాలతో అనారోగ్య బారిన పడుతున్నారు. వసతి గృహంలో టాయిలెట్ల నిర్వహణ సైతం సక్రమంగా లేకపోవడంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లే పరిస్థితి ఏర్పడుతున్నాయి.
గురుకుల పాఠశాలలోని గదులలోని ఫ్లోరింగ్ కుంగిపోయి ఉండడంతో విద్యార్థులు పడుకోవడానికి స్థలం లేక బాత్రూంల ముందట పడుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నాయని గురుకుల పాఠశాల విద్యార్థినిల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిట్లం జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సుమారు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 650 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిలకు నెలనెలకు రావలసిన మెయిన్టెనెన్స్ సైతం సక్రమంగా రాకపోవడంతో చిన్నచిన్న వస్తువులు కొనుక్కోవడానికి తల్లిదండ్రుల పై ఆధారపడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నట్లు సమాచారం ఉంది. విద్యార్థినిలు సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ గురుకుల పాఠశాలలో నిర్వహణ విషయంలో ఏ ఒక్కరు కూడా సమస్యలను బయటకు చెప్పుకోకుండా అధ్యాపకులు విద్యార్థినులను కట్టడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పిట్లం జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యల పై చర్యలు చేపట్టాలని విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు.