రెండో రోజు కొనసాగిన రాష్ట్ర స్థాయి మహిళా డిగ్రీ కళాశాలల సాంస్కృతిక ప్రదర్శనలు

by Mahesh |
రెండో రోజు కొనసాగిన రాష్ట్ర స్థాయి మహిళా డిగ్రీ కళాశాలల సాంస్కృతిక ప్రదర్శనలు
X

దిశ, కామారెడ్డి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (మర్కల్) కామారెడ్డిలో రాష్ట్ర స్థాయి స్టేట్ వైబ్రేషన్ (కల్చరల్ ఫెస్ట్) రెండో రోజు కూడా మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల పూర్వ విద్యార్థిని మాలవత్ పూర్ణ, ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి.నిరూప, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ యశోలత, కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో పాటు మర్కల్ గ్రామ మాజీ సర్పంచ్ సంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ... విద్యార్థులు ఎలా కష్టపడి ఎదగాలి, తల్లిదండ్రులు, గురువుల ఆశలను ఎలా తీర్చాలి, వారిని ఎలా సంతోష పరచాలనేది విద్యార్థులకు అవగాహన కల్పించారు.

తర్వాత 24 రకాల సాంస్కృతిక, విద్యాసంబంధ ప్రదర్శనల్లో 30 డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 24 విభాగాల్లో విజేతలకు కళాశాలకు వచ్చిన అతిథులు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందజేశారు. కాగా 11 రకాల పోటీల్లో కామారెడ్డి కళాశాల విద్యార్థులు బహుమతులు గెల్చుకున్నారు. అంతేగాకుండా ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన కళాశాల గా నిలిచింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రాధిక, రీజినల్ కో ఆర్డినేటర్ కే.అలివేలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed